ఓటీటీలోకి 'సీతా రామం'.. ఎప్పుడంటే?
on Sep 4, 2022
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'సీతా రామం'. రష్మిక, సుమంత్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
'సీతా రామం' ఐదు వారాలకే ఓటీటీలోకి రాబోతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది. థియేటర్స్ లో విడుదలకు ముందే సెప్టెంబర్ 9 నుంచి ఓటీటీలో స్ట్రీమ్ చేసేలా అమెజాన్ ప్రైమ్ తో ఒప్పందం కుదిరిందట. ఆ ఒప్పందం ప్రకారమే వచ్చే శుక్రవారం నుడి స్ట్రీమ్ అయ్యే అవకాశముందని అంటున్నారు. రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.
వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్స్ పై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ సినిమాకి ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వర రావు, సినిమాటోగ్రాఫర్ గా పీఎస్ వినోద్, శ్రేయాస్ కృష్ణ వ్యవహరించారు.
Also Read