Home

»

Latest News

పాట‌కు ప‌ద్మాభిషేకం!!

Jan 26, 2019 1:37PM

 

విరించివై విర‌చించిన....విపంచివై వినిపించిన నిన్ను  వ‌రించి విక‌సించుతున్నా... నిన్ను ధ‌రించి త‌రించి పోతున్నానంటోంది  `ప‌ద్మ‌శ్రీ` .  అక్ష‌రానికి ఆయువు పోసి ...పాట‌కు ప్రాణ‌వాయువయ్యావు..!!  పాట‌కు ప‌ట్టాభిషేకం చేసిన నీకు ఆ పాట  ప‌ద్మాభిషేకం చేస్తోంది!   అందుకోవ‌య్యా పాటానుభావ‌!!

పని చేసే ప్ర‌తి ఒక్క‌రికీ పాట‌తో ప‌రిచయం ఉంటుంది. ఎందుకంటే ప‌ని, పాట‌తో ముడిప‌డింది కాబ‌ట్టి. పాట తెలిసిన ప్ర‌తి ఒక్క‌రికీ సిరివెన్నెల పాట‌ల‌తో ప‌రిచ‌యం ఉంటుంది... ఎందుకంటే...ఆయ‌నతో పాటు పాట‌ ఎదిగింది కాబ‌ట్టి.  అందుకే ఆయన గురించి పరిచ‌య వాక్యాలు ప‌క్క‌న పెట్టి ...ఆయ‌న్ను `ప‌ద్మ‌శ్రీ` వ‌రించిన సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలుపుతోంది తెలుగు వ‌న్ డాట్ కామ్.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com