వైట్ డ్రెస్ లో దేవకన్యలా సిరి హన్మంత్
on Jun 23, 2022
సిరి హన్మంత్ బుల్లితెర మీద అందరికీ తెలిసిన పేరే. ఈమె అసలు పేరు శిరీష హన్మంత్. బిగ్ బాస్ సీజన్ 5 లో ఫస్ట్ కంటెస్టెంట్.. చాలా అందంగా ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది. చూడడానికి చిన్నగా కనిపిస్తుంది కానీ పిట్ట కొంచెం కూత ఘనం అన్న సామెతకు సరిగ్గా అతికినట్టు సరిపోతుంది. చిన్న వయసులోనే యాంకరింగ్ స్టార్ట్ చేసి నెమ్మదినెమ్మదిగా ఆర్టిస్ట్ గా బిజీ అయ్యింది. తరువాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
సిరి హన్మంత్ ఇప్పుడు వైట్ డ్రెస్ లో దేవకన్యలా మెరిసిపోతోంది. ఈ క్యూట్ పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసుకుంది సిరి. "మీకు మెరవాలనిపించినప్పుడల్లా మెరుస్తూ ఉండండి. దీనికి ఎలాంటి కారణాలు అవసరం లేదు. మీకోసం మీరు మెరుపై మెరవండి" అంటూ ఇంగ్లీష్ లో ఒక కాప్షన్ పెట్టి పిక్స్ పోస్ట్ చేసింది.
సిరి 1996లో వైజాగ్ లో పుట్టింది. చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోవడంతో అమ్మకు ఆసరాగా నిలబడింది. ఎన్నో కష్టాలు పడి ఎంబీఏ పూర్తి చేసింది. సిరికి స్క్రీన్ మీద మెరవాలని తపన పడేది. అలా ముందు ఒక ఛానల్ లో న్యూస్ రీడర్ గా వెళ్ళింది. తర్వాత షార్ట్ ఫిలిమ్స్ లో నటించే ఛాన్స్ వచ్చేసరికి ఎగిరి గంతేసి ఒప్పుకుంది. ఆ తర్వాత కొన్ని షోస్ కి యాంకరింగ్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఆడిషన్స్ కి వెళ్లి సీరియల్స్ లో నటించడం మొదలు పెట్టింది. ఉయ్యాల జంపాల, ఎవరి నువ్వు మోహిని, అగ్నిసాక్షి, మాటే మంత్రం సీరియల్స్ లో చేసింది.
ఆ తర్వాత రాజ్ తరుణ్ నటించిన 'ఒరేయ్ బుజ్జిగా' మూవీలో ఒక మంచి రోల్ లో నటించింది సిరి. ఇవే కాదు సిరి ఎన్నో అవార్డులను కూడా గెలుచుకుంది. మిస్ బ్యూటిఫుల్ స్మైల్ అవార్డు, వైజాగ్ సూపర్ స్టార్ అవార్డు, బెస్ట్ టీవీ యాంకర్ అవార్డు అందుకుంది సిరి. ఇక ఇప్పుడు వైట్ డ్రెస్ లో మెరిసిపోతున్న ఫొటోస్ చూసి క్యూటీ, బేబీ డాల్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read