Home

»

Latest News

Geetha Madhuri: నేను నోరు విప్పితే వాళ్ళ కాపురాలు కూలిపోతాయి.. గీతా మాధురి షాకింగ్ కామెంట్స్!

Apr 25, 2026

ప్రముఖ గాయని గీతా మాధురి (Geetha Madhuri) చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. నటుడు, గాయకుడు నోయెల్ నిర్వహిస్తున్న  'ఆఫ్ ది రికార్డ్' టాక్ షోలో పాల్గొన్న ఆమె..  సినిమా ఇండస్ట్రీలోని కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో బయటకు రాగానే నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఈ ఇంటర్వ్యూలో గీతా మాధురి సంచలన వ్యాఖ్యలు చేశారు. "తాను కాఫీ షాపులకు వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది ప్రేమ జంటలు కనిపిస్తుంటారని.. కొన్నిసార్లు తెలిసినవాళ్ళే ఇతరులతో కనిపిస్తూ బుక్ అవుతుంటారు" అని తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ.. "నేను గనుక నోరు విప్పితే చాలా మంది కాపురాలు కూలిపోతాయి" అని అనడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఇండస్ట్రీలో బయటకు కనిపించే ఇమేజ్ వేరు, వ్యక్తిగత జీవితాలు వేరు అనే ఉద్దేశంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

ఈ ప్రోమో చూసిన నెటిజన్లు గీతా మాధురి ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటుందని ఆరా తీస్తున్నారు. టాలీవుడ్‌లో గీతా మాధురికి మంచి గుర్తింపు ఉండటమే కాకుండా, బిగ్ బాస్ వంటి రియాలిటీ షోల ద్వారా ఆమెకు ఇండస్ట్రీలోని చాలా మంది సెలబ్రిటీలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆమె మాటల్లో ఎంతో కొంత నిజం ఉంటుందని కొందరు అభిప్రాయపడుతుంటే, షో ప్రమోషన్ కోసం చేసిన సరదా వ్యాఖ్యలే కావచ్చని మరికొందరు భావిస్తున్నారు. 

నోయెల్ షోలో గీతా మాధురి చేసిన ఈ వ్యాఖ్యల పూర్తి వివరాలు తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఆమె వ్యాఖ్యలు ఇండస్ట్రీలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో చూడాలి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com