నాలుగు కోట్ల రూపాయలని ఇచ్చిన సిద్దు జొన్నలగడ్డ!
on Jun 4, 2025
డిజె టిల్లు, టిల్లుస్క్వేర్ వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన హీరో సిద్దు జొన్నలగడ్డ.(Siddu Jonnalagadda)ముఖ్యంగా ఆ రెండు చిత్రాల ద్వారా ఎంతో మంది అభిమానులని సంపాదించాడు. అది ఎంతలా అంటే సిద్దు అనే పేరుని మర్చిపోయి 'టిల్లు' అని పిలుచుకునేంతలా. టిల్లు స్క్వేర్ తో తొలి సారి వంద కోట్ల క్లబ్ లోకి చేరి తన కంటు ఒక ప్రత్యేకమైన బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసుకున్నాడు.
ఇక 'టిల్లుస్క్వేర్' తర్వాత ఏప్రిల్ 10 న 'జాక్'(Jack)అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ఎన్టీఆర్(Ntr)తో పాటు గతంలో ఎన్నో హిట్ చిత్రాలని నిర్మించిన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర జాక్ ని నిర్మించింది. బేబీ మూవీ ఫేమ్ 'వైష్ణవి చైతన్య'(Vaishnavi chaitanya) హీరోయిన్ గా చెయ్యగా, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడుగా వ్యవహరించాడు. దీంతో రిలీజ్ కి ముందు నుంచే జాక్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఎవరు ఊహించని విధంగా తొలి షో నుంచే ప్లాప్ టాక్ ని తెచ్చుకుంది. డిజాస్టర్ గా నిలిచినా, టిల్లు స్క్వేర్ తర్వాత వచ్చిన సిద్దు మూవీ కాబట్టి, ఒక మాదిరి కలెక్షన్స్ అయినా, రాబడుతుందేమో అని అందరు అనుకున్నారు. కానీ పది కోట్ల రూపాయిల వసూళ్ళని కూడా రాబట్టలేకపోయింది. దీంతో చిత్ర నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కి భారీ నష్టాలూ వచ్చాయనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపించింది. ఈ నేపథ్యంలో తాజాగా జాక్ మూవీకి సిద్దు తాను తీసుకున్న ఎనిమిది కోట్ల రూపాయిల రెమ్యునరేషన్ లో నాలుగు కోట్ల రూపాయిలని వెనక్కి ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి.
సిద్దు అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం 'తెలుసు కదా'(Telusu Kada)అనే మూవీ చేస్తున్నాడు. ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ మూవీకి నీరజ కోన దర్శకత్వం వహిస్తుంది. రాశిఖన్నా, శ్రీనిధి హీరోయిన్ లుగా చేస్తుండగా దీపావళి కానుకగా అక్టోబర్ 17 న విడుదల కానుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
