Home

»

Latest News

స‌మంత మాజీ బాయ్‌ఫ్రెండ్ ట్వీటు... యమా హాటు!

Oct 3, 2021 1:32PM

 

అక్కినేని నాగచైతన్య, సమంత ఇకపై భార్యాభర్తలు కాదు. ఇద్దరూ విడిపోయారు. అధికారికంగా ఆ విషయాన్ని ప్రకటించేశారు కూడా! వాళ్లిద్దరూ విడిపోవడం దురదృష్టకరమని నాగచైతన్య తండ్రి నాగార్జున వ్యాఖ్యానించారు. ఆయనతో సహా పలువురు సెలబ్రిటీలు ఇద్దరికీ ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే... నాగచైతన్య, సమంత పేర్లు లేకుండా హీరో సిద్ధార్థ్ చేసిన ఓ ట్వీట్ ప్రజెంట్ హాట్ టాపిక్ అయ్యింది.

"మోసగాళ్లు ఎప్పటికీ విజయం సాధించరు - స్కూల్‌లో ఓ టీచర్ నుండి నేను నేర్చుకున్న తొలి పాఠాల్లో ఇదొకటి" అని సిద్ధార్థ్ ట్వీట్ చేశారు. సమంతను ఉద్దేశించి ఆయన ఈ ట్వీట్ చేశారని నెటిజన్లు సులభంగా గ్రహించారు. సమంతను సిద్ధార్థ్ ఎందుకు టార్గెట్ చేశారంటే.... గతంలో వాళ్లిద్దరూ ప్రేమలో కొన్నాళ్ళు ఉన్నారు కాబట్టి! 

సిద్ధార్థ్, సమంత కొన్నాళ్ళు ప్రేమలో ఉన్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. గుళ్ళు, గోపురాలకు వెళ్లి పూజలు చేశారు. ఏమైందో ఏమో? సిద్దార్థ్ నుండి సమంత దూరంగా జరిగింది.  అతడితో బ్రేకప్ తర్వాతే నాగచైతన్యకు దగ్గరైంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. ఇప్పుడు విడాకులు తీసుకున్న నేపథ్యంలో సిద్ధార్థ్ ట్వీట్ వైరల్ అవుతోంది. కొందరు అతడికి మద్దతు ఇస్తే, మరికొందరు ఇటువంటి సమయంలో మౌనంగా ఉండటం మానేసి ఇటువంటి ట్వీట్లు ఏమిటని క్లాస్ పీకుతున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com