Home

»

Latest News

సిద్ధార్ధ్ రియల్ హీరోగా మారిన వేళ !!

Dec 5, 2015 4:04PM

చెన్నైని వరద బాధితులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాయం చేస్తున్నా..తమ వంతు సాయం అందించేందుకు తమిళ హీరోలందరూ రంగంలోకి దిగారు. వీళ్లంద‌రి మ‌ధ్య సిద్దార్థ్ ప్ర‌త్యేకంగా నిలిచాడు. ఏదో డ‌బ్బుల రూపంలో విరాళం ప్ర‌క‌టించి వ‌దిలేయ‌కుండా.. చెన్నై వాసుల‌ను ఆదుకోవ‌డానికి స్వ‌యంగా రంగంలోకి దిగాడు. ట్విట్ట‌ర్‌లో త‌న‌ని ఫాలో అవుతున్న‌వారితో ఓ నెట్ వ‌ర్క్ ఏర్పాటు చేశాడు. వాళ్ల స‌హాయంతో ఆహార పొట్లాలు, మంచి నీటి ప్యాకెట్లు సేక‌రించి.. చెన్నైలో వీధి వీధి తిరుగుతూ పంచిపెడుతున్నాడు. సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్ల‌ని స‌రిగ్గా వాడుకొంటే.. ఎన్నిమంచి ప‌నులు చేయొచ్చో నిరూపిస్తున్నాడు. ట్విట్ట‌ర్‌లో సిద్దార్థ్ పిలుపున‌కు వేలాదిగా యువ‌త‌రం స్పందిస్తోంది. సిద్దూ చేస్తున్న ఈ మంచి ప‌నికి రియ‌ల్ హీరో అంటూ కితాబులు ఇస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com