గుడ్ న్యూస్.. ప్రభాస్ పెళ్ళిపై శ్యామలాదేవి ఆసక్తికర వ్యాఖ్యలు!
on Aug 11, 2025

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్ళి కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. నిజానికి 'బాహుబలి' తర్వాత ప్రభాస్ పెళ్ళి చేసుకుంటాడని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే, బాహుబలి వచ్చి పదేళ్లు అవుతుంది కానీ.. ఇంతవరకు ప్రభాస్ పెళ్ళి పీటలు ఎక్కలేదు. మధ్య మధ్యలో ప్రభాస్ పెళ్ళి అంటూ వార్తలొస్తున్నాయి కానీ.. అవేవీ నిజం అవ్వట్లేదు. ఈ క్రమంలో ప్రభాస్ పెళ్ళి గురించి తాజాగా ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (Prabhas)
అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ భీమేశ్వర స్వామిని తాజాగా శ్యామలాదేవి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభాస్ పెళ్లి గురించి పార్వతీ పరమేశ్వరులకు పూజలు చేసినట్లు తెలిపారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు.. శివుడు అనుగ్రహిస్తే త్వరలోనే ప్రభాస్ పెళ్లి జరుగుతుందని అన్నారు. అమ్మాయి ఎవరు, పెళ్ళి ఎప్పుడు అనేవి తెలియవని.. కానీ, పెళ్ళి మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని శ్యామలాదేవి చెప్పారు.
శ్యామలాదేవి మాటలు విని ప్రభాస్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఆమె కోరుకున్నట్టుగా త్వరలోనే ప్రభాస్ పెళ్ళి పీటలు ఎక్కుతారేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



