Home

»

Latest News

shruti Haasan: శృతిహాసన్ ఈ వ్యక్తితోనే కొత్తగా రిలేషన్ లో అడుగుపెట్టింది..రూమర్స్ కి చెక్ 

Jun 26, 2026 11:19AM

సౌత్ చిత్ర సీమలో మోస్ట్ లక్కియస్ట్ హీరోయిన్ ఎవరంటే శృతి హాసన్(Shruthi Haasan)అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇలా చెప్పుకోవడంలో ఎలాంటి పక్షపాతం కూడా లేదు.. రీసెంట్ గా పెద్ది హిట్ నే ఒక ఉదాహరణ. శ్రుతి హాసన్ వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో నిరంతరం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఆమె రిలేషన్‌షిప్, బ్రేకప్స్ గురించి నెట్టింట అనేక ఊహాగానాలు, రూమర్లు షికారు చేస్తున్నాయి. ఆర్టిస్ట్ శంతను హజారికాతో బ్రేకప్ తర్వాత ఆమె మళ్ళీ ప్రేమలో పడిందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో కూడా పలు కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించిన శ్రుతి హాసన్, ఈ రూమర్లపై అత్యంత ఘాటుగా స్పందిస్తూ పూర్తి క్లారిటీ ఇచ్చారు. 

ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్ చాట్‌లో ఒక నెటిజన్ నేరుగా "మీరు ప్రస్తుతం ఎవరితోనైనా రిలేషన్‌షిప్‌లో ఉన్నారా?" అని ప్రశ్నించగా, శ్రుతి హాసన్ ఏమాత్రం తడబడకుండా  నేను ప్రస్తుతం ఎవరితోనూ రిలేషన్‌లో లేను. నా కెరీర్ పై మాత్రమే పూర్తి శ్రద్ధ పెడుతున్నాను. ప్రస్తుతం నా జీవితంలో వేరే ఎవరికీ స్థానం లేదు. పెళ్లి ఆలోచనల గురించి మాట్లాడుతూ, తనకు వివాహ బంధం అంటేనే ఒక విధమైన భయం ఉందని, కేవలం ఒక కాగితం ముక్క తన ఐడెంటిటీని నిర్ధారించలేదని ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.


Also read: sunitha vs chinmayi: సునీత vs చిన్మయి..వస్త్రధారణ వ్యాఖ్యలపై ఇద్దరి మైండ్ సెట్ ఇదే

ప్రస్తుతం శ్రుతి హాసన్ర్ లిస్ట్ లో పలు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దుల్కర్ సల్మాన్  తో కలిసి  'ఆకాశంలో ఒక తార' చిత్రంలో చేస్తుంది. సలార్ 2 కూడా ఉన్న విషయం తెలిసిందే.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com