18 భాషల్లో శోభిత ధూళిపాళ ‘చీకట్లో’.. ఓటీటీ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్!
on Oct 9, 2025
అక్కినేని నాగచైతన్యతో 2024 డిసెంబర్ 4న పెళ్లి జరిగిన తర్వాత శోభిత ధూళిపాళ ఓ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ఓ వినూత్న ప్రయోగం చేస్తోంది. శోభిత ప్రధాన పాత్రలో ఓ సరికొత్త వెబ్ మూవీని నిర్మించింది. ఈ చిత్రానికి శరత్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయబోతున్నారు.
‘చీకట్లో’ చిత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ చిత్రాన్ని 18 భారతీయ భాషల్లో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. ఓటీటీలో విడుదలైన సినిమాల్లో ఇన్ని భాషల్లో డబ్ అయి రిలీజ్ అవుతున్న మొట్ట మొదటి సినిమా ‘చీకట్లో’. అన్ని భాషలకు చెందిన మూవీ లవర్స్‌కి ఈ సినిమాని చేరువ చేయాలన్న ఉద్దేశంతోనే 18 భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురి చేసే థ్రిల్లర్ జోనర్‌లో ఈ సినిమా రూపొందిందని తెలుస్తోంది. నవంబర్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలవుతుంది. అయితే స్ట్రీమింగ్ డేట్‌ని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



