Home

»

Latest News

'పుష్ప'లోని ఆ క్యారక్టర్ పై శివాజీ సంచలన వ్యాఖ్యలు: ఎంత పని చేసావు భయ్యా

Sep 23, 2026 11:32AM


ఇప్పుడు వర్సటైల్ హీరో, నటుడు శివాజీ అభిమానులు ఏడూ కొండల వాడా వేంకటేశా.. ఎంత పని చేసావు తిరుమలేశా! అని పాడుకునే పరిస్థితి. అభిమానులేంటి ఈ న్యూస్ విన్నాక తెలుగు సినిమా ప్రేక్షకులు కూడా ఆ సాంగ్ పాడుకుంటారు.

 తాజాగా జరిగిన 'తెల్ల కాగితం' చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుకకి 'శివాజీ' ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ 'మనం ఎంత ప్రణాళికలు వేసుకున్నా, ఎంత ఆశపడినా విధి నిర్ణయం మరొకలా ఉంటుంది. నిజం చెప్పాలంటే సుకుమార్ గారి 'పుష్ప' సినిమాలో మంగళం శీను పాత్రకు ఫస్ట్ ఛాయిస్ నేనే, ఆ రోల్ మొదట నాకే వచ్చింది. కానీ ఆ పాత్ర సునీల్ ఖాతాలోకి వెళ్లాలని రాసిపెట్టి ఉంది, అందుకే అది ఆయనకే దక్కింది. సునీల్ ఆ పాత్రను ఎంతో అద్భుతంగా పండించి, ఆ క్యారెక్టర్‌కు పూర్తి న్యాయం చేశారు" అని శివాజీ వెల్లడించారు. 

ఇది కూడా చదవండి: నా జీవితంలో ఆ సినిమా చేసి పెద్ద తప్పు చేశా: హీరోయిన్ సదా వ్యాఖ్యలు వైరల్

 

 ఇప్పుడు ఈ మాటలు సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి. పుష్ప సిరీస్ లో మంగళం శ్రీను క్యారక్టర్ సృష్టించిన సంచలనం తెలిసిందే. ముఖ్యంగా అన్నికంటే పుష్ప సిరీస్ పాన్ ఇండియా వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఏ క్యారక్టర్లో కైనా పరకాయ ప్రవేశం చేసి సదరు క్యారక్టర్ కి ఒక రేంజ్ ని తీసుకొచ్చే శివాజీ మంగళం శ్రీను క్యారక్టర్ చేసి ఉంటే శివాజీ ఇప్పుడు తన జైత్ర యాత్రని బాలీవుడ్ లో కూడా కొనసాగించే వాడు. ఇప్పుడు సునీల్ కెరీర్ ఎలా ఉందో, ఎలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయో చూస్తూనే ఉన్నాం.

 

[Shivaji, Shivaji About First Offered Mangalam Srinu Role Pushpa, Mangalam Srinu Role, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com