
టాలీవుడ్‌లో ఒక సినిమాపై అంచనాలు పెరగడానికి రకరకాల కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు ఫస్ట్‌లుక్, మరికొన్నిసార్లు టీజర్ ఆ అంచనాలను పెంచితే, ఈసారి మాత్రం ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న ఒక బలమైన టాక్ సినిమా రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లిపోయింది.
టాలెంటెడ్ హీరో శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ 'భోగి'. ఈ సినిమాకు సంబంధించిన ఒక గంట నిడివి గల రఫ్ ఫుటేజ్‌ను ఇటీవల ఇండస్ట్రీకి చెందిన కొందరు ముఖ్యమైన సినిమా మిత్రులు ప్రత్యేకంగా వీక్షించారు. ఆ 60 నిమిషాల విజువల్స్ చూసిన వారంతా ముక్తకంఠంతో చెప్తున్న మాట ఒక్కటే.. ఇది శర్వానంద్ కెరీర్‌లోనే మైల్ స్టోన్ లా నిలిచిపోయే చిత్రం కాబోతోంది.
సినిమా చూసిన ఆ ఇండస్ట్రీ మిత్రులు ఈ చిత్రాన్ని నేరుగా రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ 'రంగస్థలం'తో పోలుస్తుండటం విశేషం. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రా అండ్ రస్టిక్ ఎమోషన్స్, పాత్రల డిజైనింగ్, కథలో ఉండే డ్రామా చూస్తుంటే శర్వానంద్ కెరీర్‌లో ఇది ఒక 'రంగస్థలం' లాంటి ప్రభంజనం సృష్టించడం ఖాయమని వారు బలంగా నమ్ముతున్నారు.
ముఖ్యంగా ఇందులో డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్సులు ఒక రేంజ్‌లో ఉన్నాయని సమాచారం. గతంలో శర్వానంద్ ఎన్నడూ చేయని విధంగా, అత్యంత సహజంగా, ఊరమాస్ స్టైల్‌లో ఈ యాక్షన్ సీన్లను తెరకెక్కించారట. స్క్రీన్ పై శర్వానంద్ నటన, ఆయన పండించిన ఎమోషన్స్ థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని ఇండస్ట్రీ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది.
ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో విలేజ్ ఎమోషనల్ డ్రామాలకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. అఖిల్ అక్కినేని నటించిన రీసెంట్ హిట్ 'లెనిన్' కూడా 'అఖిల్ రంగస్థలం' అనే పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో 'భోగి' సినిమాతో 'శర్వానంద్ రంగస్థలం' రాబోతుంది అంటున్నారు.
ట్రేడ్ వర్గాల్లో సైతం ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే అదిరిపోయే బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి అంటున్నారు. శర్వానంద్ మార్కెట్‌ను ఈ సినిమా నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేవలం ఒక గంట ఫుటేజ్ చూసి ఇండస్ట్రీ మిత్రులు ఇంతలా ఫిదా అయ్యారంటే, రేపు థియేటర్లలో పూర్తి సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేయబోతుందోనని అభిమానులు ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. పక్కా విలేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ 'భోగి' టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
Sharwanand, Bhogi Movie, Akhil Akkineni, Lenin Movie, Rangasthalam






