Home

»

Latest News

శర్వానంద్ 'భోగి' రిలీజ్ వాయిదా: అసలు కారణం ఇదే.!

Aug 20, 2026 4:01PM

చార్మింగ్ స్టార్ శర్వానంద్, డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో వస్తున్న పిరియడ్ యాక్షన్ డ్రామా 'భోగి' మూవీ రిలీజ్ వాయిదా పడింది. K.K. రాధామోహన్ నిర్మాణంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా VFX పనుల కారణంగా ఆలస్యం అవుతోంది. ఇటీవల పూర్తి చేసుకున్న 30 రోజుల క్లైమాక్స్ షెడ్యూల్, పీరియడ్ వరల్డ్ విజువల్స్‌ను అత్యున్నత ప్రమాణాలతో అందించడానికే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

'భోగి' మూవీ టీమ్ క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకూడదని ఫిక్స్ అయిపోయింది. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ కోసం ఏకంగా 30 రోజుల పాటు నాన్-స్టాప్‌గా ఒక భారీ క్లైమాక్స్ షెడ్యూల్‌ను షూట్ చేశారు. ఈ సీన్స్ సినిమాలో వేరే లెవెల్‌లో ఉండబోతున్నాయట.

అయితే, ఈ పీరియడ్ వరల్డ్, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్, విజువల్ స్కేల్‌ను పీక్స్‌లో చూపించడానికి VFX వర్క్ చాలా కీలకంగా మారింది. ఈ గ్రాఫిక్స్ వర్క్ అనుకున్న దానికంటే ఎక్కువ సమయం తీసుకుంటోందట. ప్రేక్షకులకు ఒక బిగ్గెస్ట్ విజువల్ స్పెక్టకిల్‌ను స్క్రీన్ మీద చూపించాలనే ఉద్దేశంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. హడావుడిగా సినిమాని రిలీజ్ చేసి అవుట్‌పుట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వడం కంటే, కాస్త లేట్ అయినా సరే గూస్‌బంప్స్ ఇచ్చే ఎక్స్‌పీరియన్స్‌ను అందించడమే బెటర్ అని భావించారు.

శర్వానంద్ ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని రగ్గడ్ అండ్ పవర్ ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆల్రెడీ రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది.. ఇది మామూలు యాక్షన్ మూవీ కాదు, ఒక 'బ్లడ్ ఫెస్ట్' అని. సంపత్ నంది తనదైన మాస్ టేకింగ్‌తో ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లబోతున్నారు.

అభిమానులకు కాస్త నిరాశే అయినా.. ఈ వెయిటింగ్ ఊరికే పోదు. విజువల్స్, పీరియడ్ సెటప్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయని మూవీ టీమ్ ధీమాగా చెప్తోంది. వెయిట్ పెరిగే కొద్దీ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. ఆగష్టులో విడుదల చేయాలనుకున్న ఈ సినిమా, సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్ లో విడుదలయ్యే అవకాశముంది.

 

 

 

Sharwanand, Bhogi Movie, Postponed

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com