Home

»

Latest News

నాగ‌చైత‌న్య ద‌ర్శ‌కుడుతో శ‌ర్వానంద్!!!

Jan 29, 2019 4:55PM

యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్ ఈ ఏడాది రెండు చిత్రాల‌తో సంద‌డి చేయనున్నాడు. సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న పేరు నిర్ణ‌యించిన సినిమా వేస‌విలో విడుద‌ల కానుండ‌గా త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ `96` కి రీమేక్ గా తెర‌కెక్కుతున్న ప్రాజెక్ట్ ఈ ఏడాది ద్వితీయార్దంలో తెర‌పైకి రానుంది. ఈ రెండు సినిమాల త‌ర్వాత మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన సినిమాకి శ‌ర్వానంద్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని టాక్. ఆ వివ‌రాల్లోకి వెళితే `కార్తికేయ‌`, `ప్రేమ‌మ్`,`స‌వ్య‌సాచి` చిత్రాల‌తో టాలెంటెడ్ డైరెక్ట‌ర్ పేరు తెచ్చుకున్న యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి. ఇటీవ‌ల శర్వానంద్ కు ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ చెప్పాడ‌ని అది న‌చ్చ‌డంతో స‌దురు యంగ్ హీరో ఈ ప్రాజెక్ట్ కు వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని స‌మాచారం. అలాగే `ప‌డి ప‌డి లేచే మ‌న‌సు` నిర్మాత‌ల‌లో ఒక‌రైన సుధాక‌ర్ చెరుకూరి ఈచిత్రాన్ని నిర్మించ‌బోతున్నాడ‌ని టాలీవుడ్ టాక్. అంతేకాదు `ప‌డి ప‌డిలేచే మ‌న‌సు` బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేర విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో త‌న వంతు బాధ్య‌తగా నిర్మాత శ్రేయ‌స్సును దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని త‌క్కువ పారితోషికంలోనే శ‌ర్వానంద్ చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే శ‌ర్వా, చందు సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రావ‌చ్చు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com