Home

»

Latest News

సల్మాన్ పై షారుక్ అలా.. రాఖీ ఇలా!

Jul 1, 2016 3:20PM

"నా పరిస్తితి రేప్ చేయబడిన అమ్మాయ్ లా ఉండేది" అని సల్మాన్ తన తాజా చిత్రం "సుల్తాన్" షూటింగ్ గురించిన విశేషాలను చెబుతూ చేసిన కామెంట్ ఇప్పుడు కార్చిచ్చుగా మారింది. ఒక్కొక్కరూ ఈ కామెంట్ పై, సల్మాన్ శైలిపై ఒక్కో విధంగా కామెంట్ చేస్తున్నారు. మొన్న షారుక్ ఏమో.. "నేనే ఇప్పటివరకూ సంచలనాత్మకమైన కామెంట్లు చేస్తానేమో అనుకొనేవాడ్ని ఇప్పుడు సల్మాన్ కూడా చేరాడు. అయితే.. అతడి కామెంట్ విషయంలో నేను ఏమీ మాట్లాడదలచుకోలేదు" అన్నాడు. 

విచిత్రంగా.. బోల్డ్ బ్యూటీ రాఖీ సావంత్ ఏమో.. "ఛ ఛ సల్మాన్ అలా అని ఉండడు" అంటూ సల్మాన్ పై ఎక్కడలేని జాలి చూపిస్తోంది. కంగనా, అనురాగ్ కశ్యప్ వంటి బాలీవుడ్ ప్రముఖులు కూడా సల్మాన్ స్టేట్ మెంట్ ను తప్పుబడుతుండగా.. రాఖీ సావంత్ ఇచ్చిన ఈ తాజా స్టేట్ మెంట్ కేవలం పబ్లిసిటీ కోసమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది. ఆఖరికి సల్మాన్ సమస్యను కూడా పబ్లిసిటీ కోసం వాడేసుకొన్న రాఖీని చూసి అందరూ నోరెళ్ళబెడుతున్నారు!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com