Home

»

Latest News

నో చెప్పడం నేర్పుతున్న వెంకటేష్..

Nov 15, 2016 11:29AM

 

 నో చెప్పడం ఎలాగో నేర్చుకోమంటున్నాడు విక్టరీ వెంకటేష్. ఇంతకీ ఏ విషయంలో నో చెప్పాలి.. ఎందుకు నో చెప్పాలి అనే కదా మీ డౌడ్. ఫ్రెండ్స్ కి నో చెప్పమంటున్నాడు. అసలు సంగతేంటంటే..  విక్టరీ వెంకటేశ్. టీనేజర్లలో ‘చెడు అలవాట్ల’పై అవగాహన కల్పించేందుకు గానూ ‘టీనేజ్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో ఆయన ఫ్రెండ్స్ గురించి చెబుతూ.. సిగరెట్, మందు, లేదంటే డ్రగ్స్... ఇలా ఏదో ఒకటి ‘ఒక్కసారి ట్రై చేయొచ్చు కదా’ అని ఫ్రెండ్ అడిగితే మొహమాటానికి పోయి ‘ఏముందిలే ఒక్కసారేగా...’ అంటూ చాలా మంది కానిచ్చేస్తారు. కానీ, అదే ఆ తర్వాత ఒక వ్యసనంలా అంటుకుని పాతుకుపోతుంది. అందుకే అప్పుడు ‘ఎస్’ చెప్పే బదులు.. ముందే ‘నో’ చెప్పడం నేర్చుకుంటే బెటర్ అని చెబుతున్నాడు. మరి నిజంగానే వెంకటేష్ చెప్పినట్టు ముందుగానే నో చెబితే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు కదా..

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com