Home

»

Latest News

ఓటీటీలోకి వ‌చ్చేసిన మ‌రో హార‌ర్ మూవీ.. వాచ్‌లిస్ట్‌లో ప‌క్కాగా ఉండాల్సిందే!

May 08, 2026

హారర్ సినిమాలను ఇష్టపడే సినీ ప్రియులకు ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. వెన్నులో వణుకు పుట్టించే విజువల్స్, అడ్రినలిన్ పెంచే బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో రూపొందిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ 'సతన్: ది డార్క్' (Satan: The Dark) ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేస్తోంది. థియేటర్లలో విడుదలైనప్పుడు తనదైన ముద్ర వేసిన ఈ చిత్రం, ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.  

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మంత్ర తంత్రాలు, క్షుద్ర పూజల నేపథ్యంలో సాగే ఒక మిస్టరీ సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. హస్తినాపురం అనే కొండ ప్రాంతం చుట్టూ తిరిగే ఈ కథలో.. ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో జరిగిన ఒక క్షుద్ర పూజ వికటించి, ఒక దుష్టశక్తి బయటకు వస్తుంది. ఆ ప్రభావం ప్రస్తుత కాలంలో ఒక కుటుంబంపై ఎలా పడింది? మార్సెలిన్ అనే మహిళ ప్రవర్తన హఠాత్తుగా ఎందుకు మారింది? అనే ఆసక్తికర అంశాలతో దర్శకుడు మణికందన్ రామలింగం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ప్రధాన పాత్రల్లో ఫ్రెడరిక్ జాన్ (FJ), అయిరా పాలక్, చాందిని తమిళరసన్, మోనా బెడ్రే తదితరులు నటించారు. ముఖ్యంగా చాందిని తమిళరసన్ చేసిన ఒక విలక్షణమైన పాత్ర ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేస్తుంది. తన నాలుకను తనే కోసుకునే ఒక భయంకరమైన సీన్‌లో ఆమె నటన హైలైట్‌గా నిలుస్తుంది. భయం, ఆందోళన కలిగించే సన్నివేశాల్లో అయిరా పాలక్, ఫ్రెడరిక్ జాన్ తమ నటనతో మెప్పించారు.  

సాంకేతికంగా చూస్తే.. బాలా జి. రామస్వామి అందించిన ఛాయాగ్రహణం, అశ్విన్ కృష్ణ అందించిన సంగీతం సినిమాలోని హారర్ మూడ్‌ను రెట్టింపు చేశాయి. సౌండ్ డిజైన్ భయపెట్టేలా ఉండటంతో పాటు హారర్ లవర్స్‌కు కావాల్సిన కిక్‌ను అందిస్తుంది. గతంలో వచ్చిన హారర్ చిత్రాలతో పోలిస్తే, ఇందులో చూపించిన క్షుద్ర పూజల సీక్వెన్స్ కాస్త కొత్తగా ఉండటంతో సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాపై పాజిటివ్ చర్చ నడుస్తోంది.

ప్రస్తుతం సమ్మర్ సెలవులు కావడంతో ఇంట్లోనే ఉండి థ్రిల్లింగ్ సినిమాలను ఎంజాయ్ చేయాలనుకునే వారికి 'సతన్: ది డార్క్' ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. హారర్ చిత్రాలను ఇష్టపడేవారు వెంటనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను చూసి ఆ థ్రిల్‌ను ఫీల్ అవ్వండి. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com