Home

»

Latest News

సర్దార్ గబ్బర్ సింగ్ ట్రైలర్ టాక్

Mar 21, 2016 12:06AM

సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్లో తెలుగు హిందీ ట్రైలర్లు రిలీజ్ చేశారు. టీజర్లను హిందీకి, తెలుగుకూ వేరు వేరుగా కట్ చేసినా, ట్రైలర్ మాత్రం రెండూ ఒకేలా ఉండేలా చూసుకున్నారు. స్టోరీ రతన్ పూర్ అనే ఊహాజనిత గ్రామంలో జరుగుతుంది. మూడు రాష్ట్రాల మధ్యలో ఉన్న ఆ పురాతన గ్రామం అడుగున ఉన్న గనుల కోసం, విలన్ ఆ ఊరి ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటాడు. అదే ఊళ్లో ఉన్న ఒక రాజకుటుంబానికి వారసురాలు హీరోయిన్. ఆమెపై విలన్ మనసు పడతాడు. ఈ రాక్షసుడి నుంచి కాపాడటానికి ఆ ఊరికి సిఐని వేయిస్తాడు హీరోయిన్ తాత. ఆ తర్వాత సర్దార్ ఆట మొదలవుతుంది. ఇదీ సింపుల్ గా ట్రైలర్ లో కనిపిస్తున్న కథ. ట్రైలర్లో పవన్ చితగ్గొట్టేశాడు. ఫైట్స్ నుంచి డైలాగ్స్ వరకూ పవన్ కు చాలా ఈజీగా ఉండే ఈజ్ కనిపిస్తోంది. చూడబోతే సినిమా అంతా పవన్ షోల్డర్స్ మీదే నడుస్తుందని అర్ధమవుతోంది. స్టోరీ యావరేజ్ గా ఉండి, పవన్ మ్యానరిజమ్స్ క్లిక్కయినా, టాలీవుడ్ రికార్డ్స్ బద్ధలవటం ఖాయం. ఒకవేళ అద్భుతంగా తెరకెక్కిస్తే, నేషన్ వైడ్ రికార్డ్స్ అన్నింటికీ రిస్కే. పేరు గుర్తుందిగా..గబ్బర్ సింగ్..సర్దార్ గబ్బర్ సింగ్..ఈ డైలాగ్ తో ట్రైలర్ ఎండ్ అవతుంది. ఇదే మొత్తం ట్రైలర్ కు హైలైట్..

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com