Home

»

Latest News

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు నోటీసులు..!

Mar 29, 2016 7:39PM

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ కు నోటీసులిచ్చారు. సర్దార్ గబ్బర్ సింగ్ అనే టైటిల్ ను వాడుకున్నందుకు, సినిమాలో ఇంకా చాలా చోట్ల కాపీరైట్స్ ఉల్లంఘనకు పాల్పడినందుకు నోటీసులిస్తున్నామని పిటిషనర్ పేర్కొన్నారు. విషయంలోకి వెళ్తే, సర్దార్ గబ్బర్ సింగ్ అనే పేరు తమ కాపీరైట్స్ ను ఉల్లంఘిస్తోందని, సినిమాలో తమకు సంబంధించిన చాలా అంశాలున్నాయని సర్దార్ హిందీ ప్రొడ్యూసర్లకు అర్బాజ్ ఖాన్ నోటీసులు పంపించాడట. నోటీసుల గురించి ఇంకా పూర్తి వివరాలు బయటికి రానప్పటికీ, పవన్ ఫ్యాన్స్ మాత్రం ఇది తమకు చాలా మంచి సంకేతమని భావిస్తున్నారు. అందుక్కారణం లేకపోలేదు. గబ్బర్ సింగ్ టైం లో కొంత మంది హిందీ ప్రొడ్యూసర్లు ఆ సినిమాపై కేసులు వేసి, పాతిక లక్షలు డిమాండ్ చేశారు. ఆ తర్వాత సినిమా సూపర్ డూపర్ హిట్టయ్యింది. సెంటిమెంటల్ గా ఇప్పుడు సర్దార్ కూడా బ్లాక్ బస్టర్ అవబోతోందంటూ ఆనందిస్తున్నారు పవన్ ఫ్యాన్స్. మరి ఈ వ్యవహారాన్ని, ఎరోస్ సంస్థ ఏ విధంగా సెటిల్ చేస్తుందో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com