Home

»

Latest News

పవన్ కళ్యాణ్ ఒక జీనియస్ అంటున్న విలన్

Mar 27, 2016 11:59PM

సర్దార్ పవన్ కళ్యాణ్ పై రోజు రోజుకూ ప్రశంసల వర్షం పెరిగి పెద్దవుతోంది. మూవీ డైరెక్టర్ నుంచి, నిర్మాత, హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకూ ఇప్పటికే అందరూ పవన్ ను ఒక రేంజ్ లో మోసేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ లిస్ట్ లోకి సర్దార్ గబ్బర్ సింగ్ విలన్ పాత్రధారి శరద్ ఖేల్కర్ చేరిపోయాడు. తొలిసారి తెలుగులో నటిస్తున్న కేల్కర్ కు పవన్ బాగా నచ్చేశాడట. పవన్ ఒక మూవీ ఇన్ స్టిట్యూషన్ అని, ఆయన స్కూల్లో తానొక విద్యార్ధి లాంటి వాడినంటున్నాడు.

పవన్ సర్దార్ సినిమాకు క్రియేటివ్ హెడ్ అయినా, తనకు యాక్టింగ్ పరంగా ఎంతో ఫ్రీడమ్ ఇచ్చాడని, అలాంటి క్రియేటివ్ జీనియస్ ను తానింత వరకూ చూడలేదని అంటున్నాడు. శరద్ కేల్కర్ మనకు పెద్దగా పరిచయం లేకపోయినా, నార్త్ ఆడియన్స్ కు బాగా పరిచయం. 2004లో హల్ చల్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. 1920 ఈవిల్ రిటర్న్స్, జాన్ అబ్రహాం రాకీ హ్యాండ్సమ్ సినిమాలతో పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం శరద్ నటించిన రుస్తుం, సర్దార్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇవే కాక సిఐడీ లాంటి అనేక టీవీ సీరియల్స్ లో నటించడం విశేషం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com