Home

»

Latest News

సర్దార్ గబ్బర్ సింగ్ కొత్త ప్రోమో రిలీజైంది

Mar 25, 2016 7:57PM

పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఆకలి ఎక్కువ. పవన్ ను అలా చూస్తూనే ఉండానుకుంటారు. వాళ్ల ఆకలిని అర్ధం చేసుకున్న సర్దార్ టీం, మరో కొత్త ప్రోమోను రిలీజ్ చేసింది. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్...సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ సాగే ఫస్ట్ అండ్ టైటిల్ సాంగ్ కు సంబంధించి ప్రోమోను రిలీజ్ అయింది. ఈ ప్రోమోకు ఒక స్పెషాలిటీ ఉంది. పవన్ రకరకాల వెపన్స్ ను హ్యాండిల్ చేస్తూ, వాటిని ఒక ఆట ఆడుకుంటాడు. ఆయన వెనక దేశంలో ఉన్న అన్ని రకాల సంప్రదాయ నృత్యాల్ని డ్యాన్స్ వేయిస్తూ చూపించారు. నాన్ చాక్ నుంచి మెషీన్ గన్ వరకూ వెపన్ ను పవన్ హ్యాండిల్ చేసిన విధానం చూస్తే, అభిమానులు ఫిదా అయిపోవాల్సిందే.

చాలా రోజుల తర్వాత పవన్ స్టెప్పులను చూసే అవకాశం కూడా ఈ ప్రోమోలో కల్పించారు. ముసుగులుక్కురో, మాస్ ఫేసుబుక్కురో, వీడు లెఫ్ట్ రైట్ ఎక్సలెంట్ పోలీస్ అంటూ సాంగ్ వస్తుంటే, పవన్ మంచినీళ్లు తాగినంత ఈజీగా నాన్ చాక్ తిప్పేస్తుంటే, థియేటర్లో చూసినప్పుడు ఈ సాంగ్ కు ఏరేంజ్ రెస్పాన్స్ వస్తుందో ఊహించుకోవచ్చు.

55 సెకన్ల డ్యూరేషన్ ఉన్న ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ట్రెండ్ అవుతోంది. ట్రైలర్ తో ఆకలి తీరని పవన్ ఫ్యాన్స్ కు ఈ ప్రోమో కొంతవరకూ శాటిస్ ఫాక్షన్ ఇచ్చిందని చెప్పచ్చు. కానీ వాళ్లకు పూర్తిగా కడుపునిండాలంటే మాత్రం, అభిమానులు ఏప్రిల్ 8 వరకూ వేచి ఉండాల్సిందే మరి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com