
'బెత్లెహెం కుటుంబ యూనిట్' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మలయాళ స్టార్ నివిన్ పౌలీ నటించిన తమిళ్ మూవీ 'ఏళు కడల్ ఏళు మలై'. తమిళ దర్శకుడు రామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కోలీవుడ్ యాక్టర్ సూరి ఒక కీలక పాత్రలో నటించగా, అంజలి హీరోయిన్‌గా నటించింది.
ఒరిజినల్ వెర్షన్ తమిళ్ తో పాటు అక్టోబర్ 1న తెలుగులో కూడా 'సంచారి' టైటిల్‌తో ఒకేసారి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ, టైటిల్ వివాదం కారణంగా చివరి నిమిషంలో తెలుగు వెర్షన్ రిలీజ్ కి బ్రేక్ పడింది. ఇప్పుడు సరికొత్త టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ తమిళ సినిమాను తెలుగులో 'సప్తసాగరాలు సప్తగిరులు' పేరుతో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు.
'సప్తసాగరాలు సప్తగిరులు' సినిమాను కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎం.సుబ్బారెడ్డి తెలుగులో అక్టోబర్ 9న విడుదల చేస్తున్నారు.
ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల మండాడి సినిమాతో సక్సెస్ సాధించిన సూరి, అలాగే 'బెత్లెహెం కుటుంబ యూనిట్' సినిమాతో సంచలన విజయం సాధించిన నివిన్ పౌలీ కలిసి నటించడంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల దృష్టి బాగానే పడింది.
రొమాంటిక్ సైకాలాజికల్ థ్రిల్లర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే తమిళ్ లో విడుదలై అంచనాలను అందుకోలేకపోయిన ఈ మూవీ, తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
ఇది కూడా చదవండి: 'జైలర్ 2'లో మరో బిగ్ స్టార్.. ట్రైలర్‌లో కనిపించింది అతనేనా.?

[Saptha Sagaralu Saptha Girulu, Yezhu Kadal Yezhu Malai, Sanchari Movie, Bethlehem Kudumba Unit, Nivin Pauly, Soori, Anjali, Telugu Film News]






