Home

»

Latest News

మరో రికార్డు సృష్టించిన సంక్రాంతికి వస్తున్నాం..వెంకీ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్  

Jan 17, 2025 10:13AM

విక్టరీ వెంకటేష్(Venkatesth)వన్ మాన్ షో 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam)మూవీ ఈ నెల 14 న వరల్డ్ వైడ్ గా విడుదలైన విషయం తెలిసిందే.సంక్రాంతి పండుగనే టార్గెట్ చేసుకొని తెరకెక్కిన ఈ చిత్రం  అన్ని ఏరియాల్లో కూడా పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుపోతుంది. 

ఇక ఈ మూవీ కేవలం మూడు రోజులకే 106  కోట్ల గ్రాస్ ని రాబట్టింది.ఈ మేరకు చిత్ర యూనిట్ 'ది ఓజి ఆఫ్ సంక్రాంతి అంటూ ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది.కేవలం రిలీజైన మూడు రోజులకే 100 కోట్ల క్లబ్ లో చేరడంతో రానున్న రోజుల్లో తెలుగు సినిమా చరిత్రలో 'సంక్రాంతికి వస్తున్నాం'  సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనే  మాటలు ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.

 

దిల్ రాజు(Dil Raju)బ్యానర్ లో నిర్మాణం జరుపుకున్న ఈ మూవీలో వెంకటేష్ తో పాటు హీరోయిన్లుగా చేసిన ఐశ్వర్యరాజేష్(Aishwarya rajesh)మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhary)నటనకి ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఫిదా అవుతున్నాడు.ముఖ్యంగా ఎంటర్ టైన్మేంట్ ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.అనిల్ రావిపూడి(Anil ravipoodi)దర్శకత్వంలో 'సంక్రాంతికి వస్తున్నాం' తెరకెక్కగా  భీమ్స్ సంగీతాన్ని అందించడం జరిగింది.సాయికుమార్,ఉపేంద్ర లిమాయే,తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com