Home

»

Latest News

ఈ సంక్రాంతి సినిమాల ప్ర‌త్యేక‌త అదే!

Jan 13, 2022 2:56PM

ఈ ఏడాది సంక్రాంతికి నాలుగు తెలుగు చిత్రాలు థియేట‌ర్స్ లో సంద‌డి చేశాయి. ఆ సినిమాలే.. `బంగార్రాజు`, `రౌడీ బాయ్స్`, `సూప‌ర్ మ‌చ్చి`, `హీరో`. వీటిలో `హీరో` జ‌న‌వ‌రి 15న విడుద‌ల కానుండ‌గా.. మిగిలిన మూడు చిత్రాలు కూడా జ‌న‌వ‌రి 14న తెర‌పైకి రాబోతున్నాయి.  `బంగార్రాజు`లో కింగ్ నాగార్జున‌, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య టైటిల్ రోల్స్ లో క‌నిపించ‌నుండ‌గా.. `రౌడీ బాయ్స్`లో `దిల్` రాజు సోద‌రుడి త‌న‌యుడు ఆశిష్ హీరో. ఇక `సూపర్ మచ్చి`లో మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ క‌థానాయ‌కుడు కాగా.. `హీరో`లో సూప‌ర్ స్టార్ మహేశ్ బాబు మేన‌ల్లుడు అశోక్ గ‌ల్లా క‌థానాయ‌కుడు.

ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. వీరిలో నాగార్జున‌ని మిన‌హాయిస్తే మిగిలిన నలుగురు హీరోల‌కి కూడా ఇదే తొలి సంక్రాంతి రిలీజ్. `బంగార్రాజు`తో చైతూ ముగ్గుల పండ‌క్కి మొద‌టి సారిగా ప‌ల‌క‌రించ‌నుండ‌గా.. `సూప‌ర్ మ‌చ్చి`తో క‌ళ్యాణ్ దేవ్ కూడా అదే బాట ప‌డుతున్నాడు. ఇక డెబ్యూ హీరోస్ అశోక్ గ‌ల్లా, ఆశిష్ కి తొలి ప్ర‌య‌త్నాలే.. సంక్రాంతి చిత్రాలు. మొత్తంగా.. ఈ సంక్రాంతికి సంద‌డి చేస్తున్న యువ క‌థానాయ‌కులంద‌రికీ ఇవే ఫ‌స్ట్ పొంగ‌ల్ రిలీజెస్ అన్న‌మాట‌. మ‌రి.. వీరిలో ఎవ‌రెవ‌రికి విజ‌యాలు ద‌క్కుతాయో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com