
శంకరాభరణం(sankarabharnam).. తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన అత్యంత విలువైన ప్రాపర్టీ. స్టార్ హీరో, స్టార్ కాస్టింగ్ లేకుండా ఓన్లీ కథ, కథనాన్ని, సంగీతాన్ని మాత్రమే నమ్ముకొని వచ్చిన శంకరా భరణం అమరత్వాన్ని నింపుకున్న మూవీగా కూడా నిలిచింది. అసలు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించే రోజుల్లో 'శంకరాభరణం'. వచ్చి ఉండి, సదరు బ్రిటిష్ వాళ్ళు మూవీని వీక్షించి ఉంటే కనుక స్వాతంత్య్రాన్ని ఇచ్చి వెళ్లే వాళ్ళు అనే మాట కూడా శంకరాభరణం మూవీ లవర్స్ లో ఉంది.
గత కొన్నిరోజులుగా సినీ మార్కెట్ లో ఏ ఇద్దరు సినీ ప్రియులు కలిసినా 'శంకరాభరణం' గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటల్లో 'శంకరా భరణం లాంటి మూవీ మళ్ళీ వస్తుందా! మన ఇండస్ట్రీ ఆ దిశగా ఏమైనా ఆలోచనలు వేస్తుందా! అలాంటి మూవీ రావాలంటే ఎవరు పూనుకోవాలి!. ఒక వేళ పూనుకొని శంకరాభరణం లాంటి కథ, కథనంతో కూడిన చిత్రాలు వస్తే సినీ ప్రేమికులంతా అదృష్టవంతులు ఉండరని మాట్లాడుకుంటున్నారు.
Also read: డైరెక్ట్ తెలుగు మూవీలో ప్రదీప్ రంగనాథన్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఈల వేస్తారు
ఫిబ్రవరి 2 1980 న అంటే నాలుగున్నర దశాబ్దాల క్రితం 'శంకరాభరణం' మూవీ రిలీజ్ అయ్యింది. శాస్త్రీయ సంగీతానికి ఉన్న గొప్పతనాన్ని చాటి చెప్పడంతో పాటు ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే ప్రేమ, త్యాగం అనేవి శారీరక సుఖం కోసమే ఏర్పడవనే సత్యాన్ని సమాజానికి చాలా బలంగా చాటి చెప్పింది. ఆ మూగ, దైవ ప్రేమే 'శంకరాభరణం' చూసిన ప్రతి తెలుగు వాడి హృదయంలోకి చొరబడి నేటికీ తిష్ట వేసాయి. టీవీల్లో చూసిన వాళ్ళు, చూస్తున్న పరిస్థితి కూడా అదే. ఎన్నో రికార్డులు, అవార్డులు సొంతం చేసుకున్న శంకరా భరణంకి సంబంధించిన అందరు తెలుగు ప్రేక్షకుల బంధువులే.






