
సంజయ్ దత్... మూడున్నర దశాబ్దాల క్రితమే పాన్ ఇండియా వ్యాప్తంగా అభిమానుల చేత కట్ అవుట్ ని ఏర్పాటు చేసుకున్నాడు. గుంటూరు, విజయవాడ లాంటి ఏరియాస్ లో కూడా.. హెయిర్ స్టైల్ ఫాలో అయిన వాళ్ల కరెక్ట్ నెంబర్ ఇప్పటికి ఎవరు కనిపెట్టలేకపోయారు. ప్రెజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ లో పలు క్యారెక్టర్స్ తో తన సత్తా చాటుతు వస్తున్నాడు.
సంజయ్ దత్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తన గత జన్మకి సంబంధించిన షాకింగ్ విషయాలని పంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. అయన మాట్లాడుతు 'బొటనవేలు ముద్రలు, చేతితో రాసిన పత్రాల ద్వారా గతజన్మల వివరాలను చెప్పే ఒక గ్రామం ఉందని, అక్కడ ఒక పూజరిని కలవమని నా స్నేహితుడు చెప్పాడు. అతను చెప్పినట్టు నేను వెళ్లి కలిస్తే నా గత జన్మ గురించి చెప్పాడు.
.webp)
నేను గత జన్మలో అశోక రాజ్యంలో ఒక రాజు. నా భార్య, మంత్రి నన్ను మోసం చేసారు. నా భార్య మంత్రితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. నేను చనిపోవాలని నా భార్య నన్ను యుద్దానికి పంపింది. కానీ నేను యుద్ధంలో గెలిచి వచ్చాక వాళ్ళిద్దరి గురించి తెలిసి వాళ్ళని చంపేసాను. చివరి దశలో శివ భక్తుడిగా అడవిలో ఆమరణ నిరాహార దీక్ష చేసి మరణించానని ఆ పూజారి తెలిపాడు.
ఇది కూడా చదవండి:రామాయణ ప్రదర్శనని నిలిపేయాలి.. హిందూ జాగృతి సమితి డిమాండ్!
అలాగే.. ప్రస్తుతం నా లైఫ్ లో జరిగిన సంఘటనలకు గత జన్మని ముడి పెట్టి నేను మంచి కుటుంబంలో పుట్టి పేరు, ప్రఖ్యాతలు తెచ్చుకున్నా గత జన్మలో చేసిన ఆ రెండు హత్యల వల్లే కర్మ అనుభవిస్తున్నాను అని ఆ పూజారి చెప్పినట్టు తెలిపాడు. దీంతో సంజయ్ దత్ తన గత జన్మ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే ఆ గ్రామం ఎక్కడ ఉంది, పూజారి ఎవరు అనే విషయాలు మాత్రం ఆయన చెప్పలేదు.

మీకు నచ్చవచ్చు:పవన్ పై కోట రుక్మిణి కీలక వ్యాఖ్యలు!
మీకు నచ్చవచ్చు :నయనతార ఏమైనా మదర్ థెరిస్సానా!
[Sanjay Dutt, Sanjay Dutt karma, Bollywood, Tollywood]





