Home

»

Latest News

రియా.. కియా: వరంగల్ ఎయిర్‌పోర్టుకు సందీప్ రెడ్డి సూచించిన పేర్లు.!

Sep 19, 2026 8:10PM

వరంగల్ ప్రజల ఎన్నో ఏళ్ళ కల అయిన మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి కీలక అడుగులు పడుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ లో శంకుస్థాపన జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసి ఎయిర్‌పోర్టు అథారిటీకి అప్పగించినట్లు రేవంత్ తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఏ పేరు పెడితే బాగుంటుందో సూచించాలని ప్రజలను కోరారు. దీనికి నెటిజెన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సైతం రెండు పేర్లు సూచించడం విశేషం.

తన సొంత ఊరైన వరంగల్‌లో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కల ఎట్టకేలకు నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని సందీప్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా.. ఆ ఎయిర్‌పోర్ట్‌కు ఎలాంటి పేరు పెడితే బాగుంటుందో రెండు పవర్‌ఫుల్ ఆప్షన్లను సూచించారు.  అందులో మొదటిది "రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్" (RIA). వీరనారి రాణి రుద్రమదేవి గొప్పతనానికి, శౌర్యానికి గుర్తుగా ఈ పేరు సమంజసంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక రెండో ఆప్షన్ చూస్తే "కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్" (KIA). కాకతీయుల వారసత్వాన్ని, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా ఈ పేరు ఉండాలని ప్రతిపాదించారు.

సందీప్ రెడ్డితో పాటు మెజారిటీ నెటిజెన్లు కూడా వరంగల్ ఎయిర్‌పోర్టుకు రుద్రమదేవి, కాకతీయ పేర్లనే ఎక్కువగా సూచిస్తుండటం విశేషం.

ఇది కూడా చదవండి: శ్రీకాంత్ ఓదెల ఇంటర్వ్యూ.. చిరంజీవితో సినిమా ఆగిపోయిందా?

 

 

 

[Warangal Airport, Mamnoor Airport, Sandeep Reddy Vanga, Revanth Reddy, Rani Rudrama Devi, Kakatiya Dynasty, Telangana News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com