Home

»

Latest News

sanchita ugale: సంచితా ఆత్మహత్య కేసులో సంచలన ట్విస్ట్.. వాట్సాప్ చాట్ లో ఉన్న మ్యాటర్ ఇదే

Jun 17, 2026 3:39PM

 

చావా మూవీ ఫేమ్ యువనటి 'సంచితా ఉగలే' ఇటీవల తన ఇంట్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో హిందీ చిత్ర పరిశ్రమే కాకుండా సౌత్ చిత్ర పరిశ్రమ సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది . ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించకపోవడంతో మొదట పోలీసులు దీనిని ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, తాజాగా సంచితా మొబైల్ ఫోన్ నుండి లీక్ అయిన ప్రైవేట్ వాట్సాప్ చాట్స్ ఈ కేసులో సరికొత్త సంచలన ట్విస్ట్‌లకి తెర లేపుతున్నాయి. 

లీక్ అయిన చాట్స్ ప్రకారం, సంచితా తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతూ ఒక సైకాలజిస్ట్‌ వద్ద చికిత్స తీసుకుంటున్నట్లు స్పష్టమైంది. ఆ సంభాషణల్లో ఆమె తన మానసిక స్థితి ఎంత దారుణంగా ఉందో డాక్టర్‌తో పంచుకుంది. "నా భవిష్యత్తు అంధకారంగా అనిపిస్తోంది, నా మెదడులో ఏదో పెద్ద సమస్య ఉన్నట్లు అనిపిస్తుండటంతో పాటు ఫోకస్ చాలా వీక్ అయిపోయింది. షూటింగ్ సమయంలో డైలాగ్స్ కూడా గుర్తుంచుకోలేకపోతున్నాను. నా ఆరోగ్యం ఎప్పుడూ క్షీణిస్తూనే ఉంది, పాత పద్ధతిలో నటనపై దృష్టి పెట్టలేకపోతున్నాను" అంటూ చాట్ చేసింది.సదరు డాక్టర్ ఇచ్చిన రిప్లై లు చూస్తుంటే తన  ఆన్‌లైన్ సెషన్స్ ద్వారా ధైర్యం చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ, దాదాపు 6 నెలల చికిత్స తర్వాత కూడా తనలో ఎలాంటి సానుకూల మార్పు రాకపోవడంతో ఆమె తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది.


Also read: obsession: అబ్సెషన్ కలెక్షన్ల సునామీ.. 26 రోజుల్లో ఎంతో తెలిస్తే గుడి కడతారు 

మరోవైపు సంచితా కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆమె తండ్రి సినిమా ఇండస్ట్రీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. టెలివిజన్ రంగంలో పనిచేస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు సంచితాని నిరంతరం వేధింపులకి  గురిచేశారని, ఆ మానసిక ఒత్తిడి భరించలేకే తమ కూతురు ఈ ఘోర నిర్ణయం తీసుకుందని  ఆరోపిస్తున్నాడు. బయటకు అంతా బాగున్నట్లు కనిపించినా, లోపల ఆమె పూర్తిగా కుంగిపోయిందని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సంచితా స్నేహితురాలు ఇంద్రాక్షి కూడా ఒక నటుడు సంచితాను వేధించాడని, దానికి సంబంధించిన స్క్రీన్‌షాట్లు తన వద్ద ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే, ఆమె సహనటి మేఘా శర్మ ఈ ఆరోపణలని  తోసిపుచ్చింది. సంచితా జనవరి నుంచే అంతర్గత ఆరోగ్య సమస్యలతో బాధపడుతోందని, ఇండస్ట్రీ నుండి ఆమెకు ఎలాంటి వేధింపులు లేవని పేర్కొంది. ప్రస్తుతం పోలీసులు లీక్ అయిన చాట్స్‌ను, డిలీట్ అయిన డేటాను రికవర్ చేయడానికి ఫోన్‌ని  ఫోరెన్సిక్ ల్యాబ్‌  పంపించి అన్ని కోణాల్లో విచారణ వేగవంతం చేశారు. జూన్ 14,  ఆదివారం సాయంత్రం 6:30, 7:30 గంటల మధ్య నలసోపారాలోని తన నివాసంలో ఆమె చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.  

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com