Home

»

Latest News

ది ప్యారడైజ్ కి సంబంధించి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారో తెలుసా: పాపం భయ్యా!

Oct 1, 2026 4:50PM


బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు.. ఈ పేరు చెప్పగానే తెలుగు సినిమా అమ్ముల పొదిలో  దాగి ఉన్న తన సినీ లిస్ట్ బయటకి వస్తుంది. కామెడీ, స్ఫూఫ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సంపూర్ణేష్ బాబునేచురల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' లో బిర్యానిగా అలరించాడు. 


రీసెంట్ గా తను ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు 'గతం లో నేను  హీరోగా చేసినప్పుడు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చేవారో , అంతకు మూడు రెట్లు రెమ్యూనరేషన్ ఇచ్చారని చెప్పుకొచ్చాడు. అంటే 3 కోట్ల రూపాయిలు వరకు అన్నమాట. అయితే రెమ్యూనరేషన్ పరంగా సంపూర్ణేష్ బాబు కి న్యాయం చేశారు కానీ , అతనిలో మంచి నటుడు ఉన్నాడని , ఆ నటుడిని వాడుకోలేకపోయారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి కామెంట్స్ వినిపిస్తోంది. తాను చెప్పడమే కాకుండా ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం, 'ది ప్యారడైజ్' 2 కోట్ల నుండి 3 కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: ఓటిటిలోకి మహేంద్రగిరి వారాహి: కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే!

 

 


మరి హీరోగా సంపూర్ణేష్ బాబు ఎంత అందుకునేవాడని  3 కోట్ల రూపాయిలు అంటున్నారో, సినీ సర్కిల్స్ లో కూడా అదే 3 కోట్లు ఎందుకు చక్కర్లు కొడుతుందో తెలియదు. ఏది ఏమైనా కరెక్ట్ రెమ్యునరేషన్ చెప్పేవరకు 3 కోట్లు అనేది రూమర్ మాత్రమే. రూమర్ వీరుల ఆనందాన్ని మనమెందుకు కాదనాలి.

 

[Sampoornesh Babu Remuneration For The Paradise Movie, Sampoornesh Babu Remuneration, The Paradise Telugu Movie, Nani The Paradise, Telugu Cinema News, Telugu Cinema, Tollywood Cinema News, Tollywood]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com