విడాకుల తర్వాత ఓ స్ట్రాటజీతో ముందుకెళ్తున్న సమంత!
on Oct 18, 2021
విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సమయానికి అక్కినేని నాగచైతన్య 'లవ్ స్టోరీ' సక్సెస్‌లో ఉన్నారు. హిందీలో ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న 'లాల్ సింగ్ చడ్ఢా'లో ఇంపార్టెంట్ క్యారెక్టర్లో నటించి ఉన్నారు. తండ్రి నాగార్జునతో కలిసి సూపర్ హిట్ సినిమా 'సోగ్గాడే చిన్ని నాయనా'కు ప్రీక్వెల్ 'బంగార్రాజు'లో నటిస్తున్నారు. ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లారు. సినిమాల పరంగా చైతన్య ట్రాక్ రికార్డ్ బావుంది. మరి, విడాకుల వార్త వచ్చిన సమయానికి సమంత ట్రాక్ రికార్డ్ పరిస్థితి ఏంటి?
'ద ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్‌తో సక్సెస్ అందుకున్నారు. కానీ, అది వెబ్‌లో! గతేడాది ఎన్నో అంచనాల నడుమ విడుదలైన తమిళ హిట్ '96' రీమేక్ ప్లాప్ అయ్యింది. 'ఓ బేబీ'తో హిట్ కొట్టి రెండేళ్లు అవుతోంది. కొత్త సినిమా 'శాకుంతలం' చిత్రీకరణ పూర్తి చేసింది. కానీ, ఈ ఏడాది విడుదల కాదు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాతలు చెబుతున్నారు. కెరీర్ పరంగా ఒక్కసారి సమంత ఖాళీగా ఉన్నట్టు కనిపించారు.
కెరీర్ పరంగా ఖాళీగా ఉన్నారనే మాటలు ఒకవైపు... సమంత అవకాశవాది అని, ఆమెకు ఎఫైర్లు ఉన్నాయని, విడాకులకు ఆమె కారణమనే వదంతులు మరోవైపు... సమంతను ఉక్కిరి బిక్కిరి చేశాయి. అయితే, ఆమె అధైర్యపడలేదు. వదంతులకు వివరణ ఇచ్చారు. మెల్లగా భవిష్యత్ వైపు అడుగులు వేశారు.
సమంత రెండు కొత్త సినిమాలకు సంతకం చేశారు. తెలుగు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించే సినిమా ఒకటి, తమిళ నిర్మాతలు ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ శేఖర్ నిర్మించే సినిమా మరొకటి. రెండిటినీ తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ సినిమాలుగా తీయాలని డిసైడ్ అయ్యారు. సమంతకు రెండు భాషల్లో మార్కెట్ ఉంది. దాన్ని క్యాష్ చేసుకునేలా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. స్ట్రాటజీ ప్రకారం ముందుకెళ్తున్నట్టు అనిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ వర్కవుట్స్ చేస్తూ నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తున్నట్టు ఉన్నారు.
Also Read