Home

»

Latest News

ఏ స‌ర్టిఫికెట్ సినిమాలో అక్కినేని కోడ‌లు!!

Mar 27, 2019 3:03PM

 

ర‌మ్య‌కృష్ణ‌, స‌మంత‌, విజ‌య్ సేతుప‌తి ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తోన్న చిత్రం `సూప‌ర్ డీల‌క్స్`, త‌మిళంతో పాటు తెలుగులో ఈ సినిమా ఈ నెల 29న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్, ట్రైల‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో ఇప్ప‌టికే సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇక సెన్సార్ పూర్తి చేసుకుని `ఏ` స‌ర్టిఫికెట్ ను అందుకుంది. ఇక ఇప్పుడు అంత‌టా ఈ సినిమా గురించే చ‌ర్చ‌.  ఏ స‌ర్టిఫికెట్ సినిమాలో అక్కినేని కోడ‌లంటూ. ఇందులో స‌మంత‌, విజ‌య్ సేతుప‌తి, ర‌మ్య‌కృష్ణ పాత్ర‌లు చాలా డిఫ‌రెంట్ గా ఉంటాయ‌ని తెలుస్తోంది. ట్రాన్స్ జెండ‌ర్ గా విజయ్ సేతుప‌తి, పోర్న్ స్టార్ గా ర‌మ్య‌కృష్ణ న‌టించార‌ట‌. ఇక స‌మంత పాత్ర ఏంట‌నేది కొంచెం స‌స్పెన్స్ లో ఉంచారు. ఇప్ప‌టికే ఈ ముగ్గురుకి తెలుగులో క్రేజ్ బావుంది. అందుకే తెలుగు, త‌మిళం లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. భారీ ప్రీ రిలీజ్ కూడా జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.  ట్రైల‌ర్ చూసిన వారంద‌రూ షాక‌వుతున్నార‌ట‌. సినిమా చూసి కూడా ప్రేక్ష‌కులు క‌చ్చితంగా ఎంజాయ్ చేస్తారంటున్నారు చిత్ర యూనిట్.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com