Home

»

Latest News

కోరుకోగానే హీరోయిన్ సమంతకు బాబు దొరికేశాడు

Mar 22, 2016 11:22AM

అలా అనుకుందో లేదో, ఇప్పుడు సమంతకు బుజ్జి బాబు దొరికేశాడు. సమంతకు నీరజా కోన పర్సనల్ స్టైలిస్ట్ గా చేస్తోంది. రీసెంట్ గా ఆమెకు మ్యారేజ్ అయి బాబు పుట్టాడు. అన్ష్ అని పేరు పెట్టిన ఆ బుడతడితో ఫోటో దిగి తన ట్విట్టర్లో పెట్టింది సమంత. నాకు దేవుడి బిడ్డ. నా జీవితంలో అత్యంత అందమైన లిటిల్ సోల్ అంటూ పోస్ట్ చేసింది. దానికి రిప్లైగా నీరజ కూడా అత్యంత విలువైన నా ఇద్దరు పాపలు అంటూ ట్వీట్ చేసింది. బ్రహ్మోత్సవం షూటింగ్ టైం లో మహేష్ బాబు కూతురితో ఆడుకోవడానికి డేట్ ఫిక్స్ చేసుకుని, నాకిప్పుడో బేబీ కావాలి ఎలా అంటూ సమంత ట్విట్లర్లో అడిగిన సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టే ఇప్పుడు సమంతకు ఈ బుజ్జి అన్షు దొరికాడుగా అంటున్నారు సమంత ఫాలోవర్లు. ప్రస్తుతం సమంత నటించిన బ్రహ్మోత్సవంతో పాటు, తమిళ్ లో విజయ్ సరసన చేసిన తేరీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటి ఫలితం సమంత  కెరీర్ ను డిసైడ్ చేసే అవకాశం ఉంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com