Home

»

Latest News

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో స‌మంతకి ప‌నేంటి???

Nov 21, 2018 9:03AM

 నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్రలో న‌టిస్తోన్న చిత్రం `ఎన్టీఆర్`.  క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడుగా రెండు పార్ట్స్ లో విడుద‌ల కాబోతున్న ఈ బ‌యోపిక్ ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ స్టూడియోలో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. అయితే ఈ సినిమాలో ఇప్ప‌టికే ప్ర‌ముఖ తారాగ‌ణం న‌టిస్తోంది. లేటెస్ట్ గా ఈ సినిమాలో స‌మంత న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. `మ‌హాన‌టి` సావిత్రి బ‌యోపిక్ లో జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టించి మెప్పించిన స‌మంత ఎన్టీఆర్ చిత్రంలో ఓ కీల‌క పాత్ర పోషించ‌నుంద‌ట‌. అయితే ఆమె పోషించే పాత్ర ఏంట‌న్న విష‌యం పై క్లారిటీ  ఇంత వ‌ర‌కు రాలేదు. బ‌య‌ట విన‌ప‌డుతున్న స‌మాచారం ప్ర‌కారం జ‌మున కానీ కాంచ‌న పాత్ర‌లో గానీ స‌మంత న‌టించే అవ‌కాశాలున్నాయ‌ట‌. కీర‌వాణి సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రం జ‌న‌వరి 9న మొద‌టి పార్ట్ విడుద‌ల కానుంది. రెండో పార్ట్ జ‌న‌వ‌రి 24న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com