Home

»

Latest News

చైతూ - స‌మంత ర‌హ‌స్య‌ నిశ్చితార్థం?

Nov 25, 2016 9:18AM

నాగ‌చైత‌న్య‌, స‌మంత త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్న సంగ‌తి తెలిసిందే. ఇరు కుటుంబాల వాళ్లూ... వీళ్ల పెళ్లికి ప‌చ్చ‌జెండా ఊపేయ‌డంతో వీరి ప్రేమ క‌థ‌.. పెళ్లి పీట‌ల ఎపిసోడ్‌లోకి వెళ్ల‌గ‌లిగింది. 2017 ఆగ‌స్టులో చైతూ, స‌మంత‌ల పెళ్లి జ‌ర‌గ‌బోతోంద‌న్న‌ది విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. అయితే..  నిశ్చితార్థం ఎప్పుడు, ఎక్క‌డ‌?  అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. డిసెంబ‌రు 9న అఖిల్ నిశ్చితార్థం జ‌ర‌గ‌బోతోంది. చైతూ కంటే ముందు అఖిల్‌కే పెళ్లి కానుంది. అఖిల్ పెళ్ల‌య్యాకే చైతూ నిశ్చితార్థం జ‌రుగుతుంద‌ని చెప్పుకొన్నారు.

అయితే చైతూ - స‌మంత‌ల నిశ్చితార్థం ఆల్రెడీ జ‌రిగిపోయింద‌ని టాలీవుడ్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల నాగ‌చైత‌న్య పుట్టిన రోజు జ‌రుపుకొన్నాడు. అంత‌కంటే ముందే చైతూ, స‌మంత‌లు నిశ్చితార్థం చేసుకొన్నార‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌మంత ఫొటోల్లో ఓ ఉంగ‌రం ప్ర‌త్యేకంగా కనిపిస్తోంది. అది నిశ్చితార్థం ఉంగ‌ర‌మే అని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అఖిల్ నిశ్చితార్థం కంటే ముందే చైతూ నిశ్చితార్థం చేయాల‌న్న ఆలోచ‌న‌తోనే ఈ ర‌హ‌స్య నిశ్చితార్థ‌ని అత్యంత సన్నిహితుల మ‌ధ్య జ‌రిపించార‌ని తెలుస్తోంది. మ‌రి నిజ‌మెంతో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com