
అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత ఆ బాధ నుంచి బయటపడటానికి సమంత అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. ఫ్రెండ్స్ తో కలిసి విదేశీ టూర్లు, పార్టీలు చేసుకుంటూ ఆ విషయాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్న సమంత.. తాజాగా సన్నిహితులతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకుంది. ఆ సెలబ్రేషన్స్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా ఉండటం విశేషం.
తన స్నేహితురాలు శిల్పా రెడ్డి కుటుంబంతో కలిసి సమంత దీపావళి పండుగను జరుపుకుంది. ఈ సెలబ్రేషన్స్ లో ఉపాసన కూడా పాల్గొంది. 'ప్రియమైన వారితో పండుగ జరుపుకుంటాను' అంటూ సమంత సోషల్ మీడియాలో సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఉపాసన కూడా ఉండటంతో కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే సమంత, ఉపాసన ఎప్పటినుంచో మంచి స్నేహితులు.. ఆ స్నేహా బంధం ఇప్పటికీ అలాగే కొనసాగుతుందని ఆ ఫోటోలను బట్టి అర్థమవుతోంది.
ఇదిలా ఉంటే సంతోషంగా దీపావళి సెలబ్రేట్ చేసుకున్నట్లు ఫోటోలు షేర్ చేసిన సమంత.. ఆ సంతోషం పైకి మాత్రమే, మనసులో బాధ అలాగే ఉంది అని అర్థం వచ్చేలా ఇన్ స్టాలో స్టొరీ ఓ పెట్టింది. "ఇంటిలో దీపాల కాంతులు లేవు. స్వీట్లలో ఉన్న రుచి కరువైంది. ఏడాది ప్రారంభంలో ఏదన్నా బాధ కలిగితే ఆ తర్వాత వచ్చే పండుగలన్నీ చిన్నగానే అనిపిస్తాయి. త్వరలోనే ఈ బాధ నుంచి బయటపడి సంతోషంగా ఉంటా" అని పేర్కొంది.






