Home

»

Latest News

శర్వా... సమంత... విశాఖ ప్రేమికులు!

Jan 31, 2019 11:47AM

విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన తమిళ సినిమా '96'. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల అభినందనలు అందుకని భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శర్వానంద్, సమంత జంటగా నటించనున్నారు. తమిళ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్, తెలుగు వెర్షన్ కు దర్శకత్వం వహించనున్నారు. మార్చిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తామని నిర్మాత దిల్ రాజు తెలిపారు. తమిళ సినిమాలు చిత్ర కథ చెన్నై నగర నేపథ్యంలో జరుగుతుంది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథలో మార్పులు చేశారు. తెలుగులో విశాఖ నేపథ్యంలో కథ సాగుతుంది అని దిల్ రాజు అన్నారు. శర్వానంద్, సమంత విశాఖ ప్రేమికులు గా కనిపించనున్నారు అన్నమాట. విచిత్రం ఏంటంటే... నాగచైతన్యకు జంటగా సమంత నటిస్తున్న మజిలీ సినిమా కూడా విశాఖ నేపథ్యంలోనే సాగుతుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com