సల్మాన్ ను వాడేసుకుంటున్న జూనియర్..!
on May 17, 2016
డైరెక్ట్ గా కాకపోయినా, ఇన్ డైరెక్ట్ గా కూడా వేరే హీరోలను వాడుకోవచ్చు. ఇదే సూత్రాన్ని ఎన్టీఆర్ దమ్ము సినిమాకు వర్తింపజేయచ్చు. జూనియర్ సినిమా దమ్ము, మన దగ్గర పెద్ద దుమ్ము లేపలేదు. అయితే ఇదే సినిమాను హిందీలోకి డబ్ చేస్తే, జనాలు యూట్యూబ్ లో ఇరగబడి చూసేస్తున్నారు. మార్చి నుంచి ఇప్పటికి 87 లక్షలకు పైగా వ్యూస్ వచ్చేశాయి. ఈ సినిమాలో అంతలా అక్కడోళ్లకు నచ్చింది ఏముందబ్బా అన్న డౌట్ వచ్చింది కదా.. ఈ డౌట్ అందరికీ వస్తుంది లెండి. అయితే అందుక్కారణమేంటా అని సరిగ్గా పరిశీలిస్తే, లోగుట్టు దొరికింది. సినిమాను సుల్తానోం కా సుల్తాన్ అన్న పేరుతో డబ్ చేశారు. ప్రస్తుతం హిందీ ప్రేక్షకులకు మోస్ట్ వెయిటింగ్ సినిమా సల్మాన్ ఖాన్ తీస్తున్న సుల్తాన్ మూవీ. కరెక్ట్ గా అదే పేరుతో ఈ సినిమా డబ్ చేయడంతో, సెర్చ్ లో ఈ సినిమాయే టాప్ 5 లో వస్తోంది. ఏంటా ఇదేదో ఎరైటీగా ఉందని జనం కూడా చూసేస్తున్నారు. ఆ విధంగా మన తారక్ గారి సినిమా యూట్యూబ్ లో హిట్టయ్యింది. సుల్తాన్ సినిమా రిలీజయ్యేవరకూ ఈ సినిమాకు కూడా ఎలాంటి ఢోకా లేనట్టే. వందరోజులు పక్కా..
Also Read