Home

»

Latest News

సల్మాన్‌ఖాన్ ‌‘భాయిజాన్‌’ ఫస్ట్ లుక్

May 26, 2015 8:14PM

సల్మాన్‌ఖాన్‌ నటించిన ‘భజరంగి భాయిజాన్‌’ సినిమా ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేసి అందరికీ షాకిచ్చాడు షారుక్‌ఖాన్‌. గత కొన్ని సంవత్సరాలుగా తమ మధ్య వైరాన్ని చెప్పకనే చెప్పేశారు కూడా. కానీ వారిద్దరి మధ్య మళ్ళీ స్నేహం చిగురించినట్టు సమాచారం. కావాలంటే చూడండీ.. ‘హీరోగా వుండటం కంటే సోదరుడిగా వుండటమే చాలా గొప్ప విషయం అని నమ్ముతా.. ‘భాయిజాన్‌’ 2015 ఈద్‌కి విడుదలవతుంది.. ఫస్ట్‌ లుక్‌ బాగుందా? అంటూ షారుక్‌ఖాన్‌ తన ట్విట్టర్‌లో సల్మాన్‌ఖాన్‌ ఫొటోని పోస్ట్‌ చేశాడు.దర్శకుడు కబీర్‌ఖాన్‌, ఈ లింక్‌ని తన ట్విట్టర్‌ అక్కౌంట్‌లో షేర్‌ చేశాడు. ఇంకేముంది అటు సల్మాన్‌ అభిమానులు, ఇటు షారుక్‌ అభిమానులూ పండగ చేసుకుంటున్నారు. సల్మాన్‌ఖాన్‌ సరసన కరీనాకపూర్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com