Home

»

Latest News

సీతమ్మతల్లి సాయిపల్లవి పై ట్రోల్స్.. ఇది వాళ్ళ పనే 

Aug 1, 2026 6:38PM

 


రామభక్తులు, సీతమ్మ భక్తులు, హనుమాన్ భక్తులు ఎంతో రీగర్ గా వెయిట్ చేస్తున్న రామాయణ(Ramayana)రిలీజ్ కి శరవేగంగా ముస్తాబు అవుతుంది. భారతీయ సినీ చరిత్రలోనే ఎన్నడూ లేనంత అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ అంచనాల నడుమ  4,000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న'రామాయణం' రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ దృశ్య కావ్యం ఫస్ట్ పార్ట్ ట్రైలర్‌ని రెండు రోజుల క్రితం తెల్లవారుజామున 4:15 గంటల పవిత్రమైన బ్రహ్మముహూర్తాన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.

భారతీయ సంస్కృతి, పురాణ కావ్యమైన రామాయణాన్ని హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గట్టుగా అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లేందుకు నిర్మించిన ఈ ట్రైలర్ యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలోట్రెండ్ అవుతోంది. అయితే, ట్రైలర్ బయటకి  వచ్చిన కొన్ని గంటల్లోనే ఒకవైపు విశేష ప్రశంసలు వెల్లువెత్తుతుండగా, మరోవైపు నెట్టింట రచ్చ, విమర్శలు, నెగెటివ్ ట్రోల్స్ దావానలంలా వ్యాపించాయి. ముఖ్యంగా దక్షిణ భారత లేడీ పవర్ హౌస్ సాయి పల్లవి, బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ క్యారెక్టర్స్ తీరుపై కొన్ని వర్గాల నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ఆసక్తికరంగా మారింది. 
ముఖ్యంగా సాయి పల్లవిని సీతాదేవిగా చూసిన కొంతమంది ఆమె లుక్స్, కాస్ట్యూమ్స్, మేకప్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్,నార్త్ ఇండియాకి  చెందిన కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో 'రామాయణం వంటి దివ్యమైన కథలో సీతమ్మ తల్లికి ఉండాల్సిన ఆభరణాల భవ్యత, మెరుపు లోపించాయి. సాయి పల్లవి చాలా సాధారణంగా కనిపిస్తోంది. గతంలో నార్త్ మీడియా ప్రతిపాదించిన బాలీవుడ్ గ్లామర్ తారల రేంజ్ వైభవం ఇందులో కనిపించడం లేదు అని సాయి పల్లవి ఆర్మీ మరియు కొన్ని చారిత్రక కోణాలపై చేసిన పాత వ్యాఖ్యల వీడియోలని  మళ్ళీ తవ్వి తీస్తూ బాలీవుడ్‌లో ట్రోలింగ్ మొదలుపెట్టారు.


Also read: పవన్ కళ్యాణ్ బాటలో అన్నా కొణిదెల..  6,30,000 రూపాయలతో 


అయితే ఈ అసత్య ప్రచారాలకు మరియు హేట్ ట్రోల్స్‌కు సౌత్ సినీ ప్రియులతో పాటు లక్షలాది మంది రామాయణ అభిమానులు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. సీతాదేవి అంటే కేవలం భారీ మేకప్, ఆభరణాలు తొడిగిన గ్లామర్ బొమ్మ కాదని, పవిత్రత, అమాయకత్వం, సాత్వికత, భక్తి మరియు అంతర్గత సాధికారతకు ప్రతీక. సాయి పల్లవి ముఖంలో కనిపించే ఆత్మీయత, పవిత్రమైన హావభావాలు సీతాదేవిగా  నూటికి నూరు శాతం సరిగ్గా సరిపోయాయని ఫ్యాన్స్ ఆమెకి మద్దతుగా నిలుస్తున్నారు. రామాయణ వరల్డ్ వైడ్ గా దీవాలి కానుకగా నవంబర్ 8 న విడుదల కానుంది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com