Home

»

Latest News

"తిక్క" విడుదలయ్యేది అప్పుడే!

Jun 28, 2016 12:09PM

"సుప్రీమ్" సక్సెస్ తర్వాత సూపర్ ఫామ్ లో ఉన్న యంగ్ మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం "తిక్క". నందమూరి కళ్యాణ్ రామ్ తో "ఓమ్" అనే త్రీడీ సినిమా తీసిన కెమెరామెన్ టర్నడ్ డైరెక్టర్ సునీల్ రెడ్డి "తిక్క" చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. టాకీ పార్ట్ పూర్తయిన ఈ చిత్రం పాటల్ని ప్రస్తుతం హైద్రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ ఫరా కరిమిపై ఓ స్పెషల్ సాంగ్ ను బార్ సెటప్ లో షూట్ చేస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం ఆడియోను జూలై రెండో వారంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్న "తిక్క" టీమ్ .. సినిమాను ఆగస్ట్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యారట. హీరో సాయిధరమ్ తేజ్ అఫీషియల్ గా కూడా ఎనౌన్స్ చేసేశాడు. ఈ సినిమా కూడా హిట్టయితే సాయిధరమ్ తేజ్ కౌంట్ ప్రకారమే కాక.. కెరీర్ పరంగానూ హ్యాట్రిక్ కొట్టేసి హ్యాట్రిక్ హీరో అయిపోవడం ఖాయం!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com