'కబాలి'లో రజనీ కూతురు హీరోయిన్గా సినిమా మొదలైంది
on Feb 5, 2020
'కబాలి' సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తెగా నటించి ఫైట్లు చేసిన సాయిధన్సిక గుర్తుందా? ఆమె హీరోయిన్గా తెలుగులో ఒక సినిమా ప్రారంభమైంది. హరి కొలగాని డైరెక్టర్‌గా పరిచయమవుతూ రూపొందిస్తోన్న ఈ సినిమాని శ్రీ సాయిలక్ష్మీ క్రియేషన్స్ బ్యానర్‌పై పి.యస్.ఆర్. కుమార్ (వైజాగ్ బాబ్జి) నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వి.వి. వినాయక్ క్లాప్ ఇవ్వగా, సీనియర్ నిర్మాత బి.వి.యస్.ఎన్. ప్రసాద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గౌరవ దర్శకత్వం వహించారు. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం (ఫిబ్రవరి 6) ప్రారంభమై ఇరవై రోజుల పాటు రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది.
దర్శకుడు హరి కొలగాని మాట్లాడుతూ, "నేను శబ్దాలయా, అన్నపూర్ణ సంస్థలలో డైరెకక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. నేను రాసుకున్న కథ సినిమాగా మారడానికి కారణం బెక్కం వేణుగోపాల్. ధన్సిక పాత్ర చాలా కొత్తగా ఉంటుంది" అని చెప్పారు. హీరోయిన్ సాయిధన్సిక మాట్లాడుతూ, "తెలుగు సినిమా పరిశ్రమ అంటే నాకు చాలా స్పెషల్. ఇక్కడ చాలా మంచి వాతావరణం ఉంటుంది. డైరెక్టర్ హరి నాకు కథ చెప్పగానే ఓకే అనడానికి ఎక్కవ టైం తీసుకోలేదు" అన్నారు.
సాయిధన్సిక, కిషోర్, తేజ్ కూరపాటి ('హుషారు' ఫేమ్), అభినవ్ ('హుషారు' ఫేమ్), ధీరజ్, నవకాంత్, చమ్మక్ చంద్ర తారాగణమైన ఈ మూవీకి డైలాగ్స్: కరుణ్ వెంకట్, లిరిక్స్: కిట్టు విస్సాప్రగడ, మ్యూజిక్ డైరెక్టర్: శేఖర్ చంద్ర, డి.ఓ.పి: వాస్లి శ్యాం ప్రసాద్, ఎడిటింగ్: వెంకట్ బాబు, స్టంట్స్: రాబిన్ సుబ్బు, ఆర్ట్ డైరెక్టర్: షర్మిల యెలిశెట్టి, లైన్ ప్రొడ్యూసర్: వెంకట యస్.కె. కులపాక.
Also Read