Home

»

Latest News

హమ్మయ్య చైతూ సినిమా రిలీజవుతోంది

Sep 22, 2016 2:31PM

చైతన్య సినిమా అనగానే మొన్న ఆడియో రిలీజ్ జరుపుకున్న ప్రేమమ్ అనుకోనేరు..కాదు..కాదు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఎప్పుడో మొదలైన "సాహసం శ్వాసగా సాగిపో". టీజర్, ఆదిరిపోయే ఆడియోలతో పాటు "ఏం మాయ చేశావే" లాంటి క్లాసిక్ హిట్ తర్వాత గౌతమ్, చైతూల కాంభినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అప్పట్లో భారీ హైప్ తెచ్చుకుంది ఈ మూవీ. అయితే సినిమా మాత్రం విడుదలకు నోచుకోలేదు. రేపు..ఎల్లుండి అంటూ ఏడాది పాటు అక్కినేని అభిమానుల్ని వెయిట్ చేయించిన ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్‌కు రెడీ అవుతోంది. అక్టోబర్ 7న రిలీజ్ అనుకుంటే అదే రోజు నాగచైతన్య నటించిన మరో చిత్రం ప్రేమమ్ అదే రోజు ఖాయమైంది. దీంతో అక్టోబర్ మూడో వారంలో తెలుగు, తమిళ భాషల్లో సాహసం శ్వాసగా సాగిపో ధియేటర్లలోకి రానుంది. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com