Home

»

Latest News

saanve Megghana: చేసిన ప్రతి మూవీ సూపర్ హిట్.. కానీ స్టార్‌డమ్ కోసం తెలుగు హీరోయిన్ ఎదురుచూపులు

Jun 11, 2026 3:39PM

 

 

ఇండస్ట్రీలో ఎంతోమంది నటీమణులు గ్లామర్ ప్రపంచంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. కొందరు కేవలం ఒక్క సినిమాతోనే ఓవర్‌నైట్ స్టార్స్ అయిపోతే, మరికొందరు వరుస విజయాలు అందుకున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల ఆదరణని పొందలేకపోతుంటారు. సరిగ్గా ఇదే కోవకి చెందుతుంది టాలీవుడ్ ముద్దుగుమ్మ శాన్వి మేఘన. 


1998 సెప్టెంబరు 12న హైదరాబాద్‌లో జన్మించిన ఈ అందాల భామ తన సినీ ప్రయాణాన్ని 2019లో మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం "సైరా నరసింహారెడ్డి"తో స్టార్ట్ చేసింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీలో శాన్వి ప్రాధాన్యత గల రోల్ నే పోషించింది. అదే సంవత్సరంలో "బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్" చిత్రంలోనూ , ఆ తర్వాత ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన మొదటి తెలుగు ఆంథాలజీ సిరీస్ "పిట్ట కథలు" (2021) లోని 'రాముల' సెగ్మెంట్‌లో అద్భుతమైన నటన కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆపై అఖిల్ అక్కినేని హిట్ చిత్రం "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్" లో కేమియో రోల్ చేయడమే కాకుండా, ఆనంద్ దేవరకొండ సరసన "పుష్పక విమానం" లో షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ రేఖగా చేసి నటించి ఆడియెన్స్‌ని  కడుపుబ్బా నవ్వించింది. ఈ చిత్రంలోని ఆమె కామెడీ టైమింగ్, నటన ప్రేక్షకులని  ఎంతగానో ఆకట్టుకున్నాయి.

 రీసెంట్‌గా వచ్చిన ఫాంటసీ రైడ్ "టుక్ టుక్" వంటి చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద మరియు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా, కోలీవుడ్‌లోనూ అడుగుపెట్టి 2025లో విడుదలైన తమిళ కామెడీ డ్రామా "కుడుంబస్థాన్" లో వెన్నెల పాత్రలో మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు 25 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమాతో తమిళంలోనూ క్రేజీ ఎంట్రీ ఇచ్చింది. ఇలా ఆమె కెరీర్‌లో చేసిన 100 శాతం ప్రాజెక్టులు మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. సినిమా హిట్టైనా, ఆ విజయాల్లో తను కూడా ఒక ముఖ్యమైన భాగమైనా, ప్రేక్షకుల్లో మాత్రం ఇంకా సరైన గుర్తింపు రావడం లేదనే చెప్పాలి.

Also read: Allu Arjun: పవన్ కళ్యాణ్‌ని కలిసిన అల్లు అర్జున్.. సీక్రెట్ మీటింగ్ వెనుక అసలు కథ ఇదేనా?


సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, తన గ్లామరస్ ఫోటోషూట్లతో నెటిజన్ల మతిపోగొడుతున్న ఈ హైదరాబాద్ బ్యూటీపై ప్రేక్షకులకి ఎప్పుడు దయ కలుగుతుందో చూడాలి. శాన్వి అచ్చ తెలుగు తెలంగాణ అమ్మాయి.

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com