Home

»

Latest News

'ఆర్​ఆర్​ఆర్​' ప్రభంజనం మొదలైంది.. 'బాహుబలి-2' రికార్డ్స్ బ్రేక్

Mar 24, 2022 11:52AM

'ఆర్​ఆర్​ఆర్​' మూవీ రికార్డుల వేట మొదలైంది. విడుదలకు ముందే ఈ సినిమా ఎన్నో సంచలనాలు సృష్టిస్తోంది. అమెరికా ప్రీమియర్​ ప్రీ సేల్స్​లో ఈ సినిమా ఇప్పటికే 2.5 మిలియన్​ డాలర్ల మార్కును దాటి ఇండియన్ సినీ చరిత్రలో కొత్త రికార్డు క్రియేట్ చేసింది.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి-2' ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ రికార్డులను రాజమౌళి దర్శకత్వంలోనే తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' బ్రేక్ చేస్తుండటం విశేషం. అమెరికా ప్రీమియర్స్ ప్రీ సేల్స్​లో 2.4 మిలియన్​ డాలర్లను వసూలు చేసింది 'బాహుబలి-2'. ఆర్ఆర్ఆర్ ఇప్పటికే 2.5 మిలియన్​ డాలర్ల మార్కును దాటేసి ఆ రికార్డు బ్రేక్ చేసింది. అంతేకాదు 3మిలియన్​ మార్క్ వైపు పయనిస్తూ మునుపెన్నడూ చూడని బెంచ్​మార్క్​ను సెట్​ చేయబోతోంది. 

అలాగే సినీమార్క్ థియేటర్స్ సింగిల్ చైన్ లో ప్రీమియర్స్​ ప్రీ సేల్స్​ తో 1 మిలియన్ మార్క్ దాటిన మొదటి ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

జూనియర్ ఎన్టీఆర్​, రామ్ ​చరణ్​ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమెరికాలో నేడే (మార్చి 24) ప్రీమియర్​ షోలు వేయనున్నారు. ఇండియాలోనూ అర్థరాత్రి నుంచి స్పెషల్ షోలు స్టార్ట్ కానున్నాయి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com