Home

»

Latest News

'రౌడీ బాయ్స్' ట్రైలర్ రిలీజ్ చేసిన తారక్

Jan 8, 2022 5:30PM

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై హ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం 'రౌడీ బాయ్స్'. ఈ సినిమాతో శిరీష్ త‌న‌యుడు ఆశిష్‌ హీరోగా పరిచయమవుతున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా కనువిందు చేయనున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ బాగుందని చెప్పిన తారక్.. ఆశిష్‌ ని తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరుతూ మూవీ టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

'హుషారు' సినిమాతో దర్శకుడిగా పరిచయమై యూత్ ని అలరించిన హ‌ర్ష కొనుగంటి.. 'రౌడీ బాయ్స్' సినిమాని కూడా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించాడని ట్రైలర్ ని బట్టి అర్థమవుతోంది. ఫ్రెండ్ షిప్, కాలేజ్ గొడవలు, ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఏజ్ లో తనకంటే కాస్త పెద్దదైన హీరోయిన్ ని హీరో లవ్ చేయడం, ఇద్దరూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వంటివి ట్రైలర్ లో కనిపించాయి. అనుపమ పరమేశ్వరన్ గ్లామర్, దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఈ ట్రైలర్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మది సినిమాటోగ్రఫీ ట్రైలర్ కి రిచ్ లుక్ తీసుకొచ్చింది.

యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సినిమాలు తీసి హిట్ కొట్టిన దిల్ రాజు బ్యానర్.. తమ ఫ్యామిలీ నుంచి ఆశిష్‌ ని హీరోగా పరిచయం చేస్తూ తీసిన 'రౌడీ బాయ్స్'తో ఈ సంక్రాంతికి హిట్ కొడతారేమో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com