Home

»

Latest News

చిరు, మహేశ్‌లపై శంకర్ కన్ను

Nov 25, 2016 4:00PM

చిరంజీవి-శంకర్, మహేశ్-శంకర్ ఈ క్రేజీ కాంభినేషన్ గురించి మనం చాలా సార్లు విన్నాం..అదిగో సినిమా, ఇదిగో సినిమా అంటూ పుకార్లు కూడా వ్యాపించాయి. నిప్పు లేనిదే పొగ రానట్లు..చిరంజీవితో ఓ సినిమా చేయాలని కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ట్రై చేస్తున్నాడు శంకర్. అసలు జెంటిల్మన్ కథను మొదటగా చిరంజీవికే చెప్పాడట శంకర్..అయితే ఏ కారణం వల్లనో ఆ ఆఫర్‌‌ను తిరస్కరించాడట చిరు. ఆ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించిన తర్వాత హిందీలో రీమేక్ చేశాడు మెగాస్టార్.

ఇక, ప్రిన్స్ విషయానికి వస్తే హిందీలో సూపర్‌హిట్ అయిన త్రీ ఇడియట్స్ రీమేక్ కోసం ఫస్ట్ ప్రిఫరెన్స్ మహేశ్‌కే ఇచ్చాడు శంకర్. కానీ రీమేక్‌లో నటించడం తనకు నచ్చదని సూపర్‌స్టార్ తెగేసి చెప్పడంతో విజయ్‌కి అవకాశం దక్కింది. అయితే తాజాగా రోబో‌కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న రోబో 2.0కి కలెక్షన్లే లక్ష్యంగా వ్యూహాన్ని రచిస్తున్న శంకర్..తెలుగు వెర్షన్‌లో ఓ ఐదు నిమిషాల పాత్రను ఇక్కడి స్టార్ హీరోతో చేయించాలని అనుకుంటున్నాడు. ఈ గెస్ట్ రోల్‌లో చిరంజీవిని లేదంటే మహేశ్‌ని నటింపచేయాలని ప్రయత్నిస్తున్నాడు. మరి ఈ ఇద్దరిలో ఎవరు శంకర్‌తో డీల్ ఓకే చేసుకుంటారో వేచి చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com