Home

»

Latest News

Riteish deshmukh: నన్ను క్షమించండి... అలా జరగకుండా ఉండాల్సింది

Jun 5, 2026 10:27AM

 

 

మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'రాజా శివాజీ'(Raja Shivaji)సక్సెస్ సందర్భంగా  రితేశ్ దేశ్‌ముఖ్ తన చిత్ర యూనిట్, నటీనటులు మరియు సన్నిహితుల కోసం ఒక సక్సెస్ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే ఈ వేడుకలో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో తీవ్ర దుమారానికి కారణమైంది. ఆ పార్టీలో రితేశ్ దేశ్‌ముఖ్ ఒక బాలీవుడ్ మాస్ సాంగ్‌కి  జోష్‌తో డాన్స్ చేసాడు. దురదృష్టవశాత్తూ ఆ సమయంలో ఆయన ధరించిన టీషర్ట్‌పై ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రం ముద్రించి ఉంది. శివాజీ మహారాజ్ చిత్రం ఉన్న దుస్తులు వేసుకుని అలా బాలీవుడ్ పాటలకి  డాన్స్ చేయడం పట్ల నెటిజన్లు, శివాజీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఛత్రపతి శివాజీని అవమానించడమేనంటూ నెట్టింట పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. వీడియోలో రితేశ్ ప్రవర్తనను చూసి ఆయన మద్యం మత్తులో ఉన్నారంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు గుప్పించారు.

ఈ వివాదం కాస్తా తీవ్రరూపం దాల్చడంతో రితేశ్ దేశ్‌ముఖ్ వెంటనే స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా నేను ఒక నిజమైన 'శివప్రేమి' (శివాజీ భక్తుడు) ని ,  సినిమా ప్రమోషన్స్ కోసం ఆ ప్రత్యేకమైన టీషర్ట్‌ని డిజైన్ చేసాము. ఆ రోజు ఉదయం నుండి రాత్రి వరకు సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లోనే బిజీగా గడిపాను. ఆ తర్వాత  వెంటనే  పార్టీకి రావలసి వచ్చింది. ఆ హడావిడిలో కనీసం బట్టలు మార్చుకునే సమయం కూడా దొరకలేదు. ప్రేక్షకులని నా కుటుంబసభ్యులుగా భావిస్తాను. ఎవరి మనోభావాలనైనా గాయపరిచి ఉంటే క్షమించాలి.

Also read: Peddi: పెద్ది ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్

నా జీవితంలో ఇప్పటివరకు ఒక్క చుక్క కూడా మద్యం ముట్టలేదు.భవిష్యత్తులో కూడా ఎప్పటికీ ముట్టను. అందువల్ల నేను మద్యం సేవించి డాన్స్ చేశాననే ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. ఈ మూడున్నరేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో సినిమా కోసం రాత్రింబవళ్లు కష్టపడిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు చెప్పేందుకే ఈ ప్రైవేట్ ఈవెంట్ నిర్వహించాం. అసలు ఆ వీడియో తీసిన వ్యక్తికి మేము  కనీసం ఆహ్వానం కూడా పంపలేదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ మన అందరికీ స్ఫూర్తి, ఆత్మగౌరవానికి ప్రతీక. ఆయనపై నాకున్న భక్తి, గౌరవం ఎప్పటికీ పదిలంగా ఉంటాయని  'జై శివరాయ్' అంటూ రితేశ్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తెలిపాడు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com