మోడీ కంటే సన్నీ లియోనే బెస్ట్ - వర్మ
on Mar 3, 2016
వర్మలాంటి ఒక కాంట్రవర్సీ కింగ్ కు ట్విట్టర్ ను మించిన ఆయుధం ఏముంటుంది. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా ఆడుకోవడానికి రామ్ గోపాల్ వర్మకు దొరికిన తిరుగులేని వెపన్ ఇది. లేటెస్ట్ గా ఆయన ట్విట్టర్ కత్తి సన్నీలియోన్ పై గురి పెట్టింది. వర్మకు శృంగార రసం అంటే ఇంట్రస్ట్ కాస్త ఎక్కువే అని అందరికీ తెలుసు. దాన్ని ఇప్పుడు శృంగార తార సన్నీ లియోన్ మీద అభిమానంగా కురిపిస్తున్నాడు. అది కూడా చాలా వెరైటీగా, సన్నీ లియోన్ తో పాటు, నరేంద్ర మోడీని కూడా టాపిక్ లో ఇన్ వాల్వ్ చేస్తున్నాడు. " దేశానికి ఆనందం పంచడంలో, nm (నరేంద్ర మోడీ) ప్రభుత్వం కంటే సన్నీ లియోన్ బాగా సక్సెస్ అయింది ", అసెంబ్లీలో బూతు సినిమాలు చూసిన ఎమ్మెల్యేలు గొప్పవాళ్లా, సన్నీ లియోన్ గొప్పదా ", " భారతదేశాన్ని nm (నరేంద్ర మోడీ) కంటే, సన్నీ లియోనే బాగా ముందుకు తీసుకెళ్లగలదు ", ఇవీ వర్మ చేసిన ట్వీట్లలో కొన్ని. తన ట్విట్టర్ ఫాలోయర్లకు ఇలాంటి ప్రశ్నలతో, ఏకంగా ఒక పోల్ నిర్వహించేస్తున్నాడు వర్మ. ఇంతకీ ఇప్పుడు వర్మ చూపు సన్నీ లియోన్ ఎందుకు పడినట్టో..?