రేపు రేణుదేశాయ్ ఇంట్లో చాలా స్పెషల్ డే..!
on Apr 7, 2016
ఏప్రిల్ 8 పవన్ ఫ్యాన్స్ కు చాలా స్పెషల్ డే. ఆయన మాజీ భార్యకు మాత్రం ఇంకా ఇంకా స్పెషల్ డే. ఎందుకంటే అది పవన్ రేణుల తనయుడు అకీరా పుట్టిన రోజు. ఉగాదితో పాటు, అకీరా పుట్టినరోజు, పవన్ సర్దార్ విడుదలతో రేణు దేశాయ్ ఇంట్లో రేపు మూడుపండగలు చోటుచేసుకుంటున్నాయి. అకీరా నందన్ పుట్టి రేపటికి 12 ఏళ్లు అవుతుంది. రేణు ప్రస్తుతం ఈ ట్రిపుల్ ఫెస్టివల్ హ్యాపీనెస్ లో ఉన్నారు. రేణుకే కాదు, పవన్ అభిమానులకు కూడా ఇది గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే పవన్ ఫ్యాన్స్ అందరూ అకీరాకు సంబంధించిన న్యూస్ ను కూడా చాలా కీన్ గా ఫాలో అవుతుంటారు. ఇప్పటికే హ్యాపీ బర్త్ డే అకీరా అంటూ రేణు ట్విట్టర్ ను తమ అభిమానంతో ముంచెత్తారు పవన్ ఫ్యాన్స్. ఈ సందర్భాన్ని రేణుదేశాయ్ ట్విట్టర్లో అభిమానులందరితోనూ పంచుకుంది. ఉగాది పండుగ, మా అందరికీ నిజమైన పండుగ అంటూ ట్వీట్ చేసింది. మరి పుట్టిన రోజున అకీరా తన తండ్రి సినిమా చూడబోతున్నాడా..?