
-అభిమానులకి, నెటిజెన్స్ కి క్రేజీ ఆఫర్
-ఇస్తుంది ఎవరి కాదు క్రేజీ హీరోయిన్
-ఆ విషయంలో నచ్చితే చాలు ఏకంగా పెళ్లి
తెలుగు ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో చేసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన భామ రేఖ(Rekha).ముఖ్యంగా 'ఆనందం' మూవీ తనకి మంచి క్రేజ్ ని ఇవ్వడమే కాకుండా, సదరు చిత్రంలోని 'కనులు మూసినా కనులు తెరిచినా కలలు ఆగవేళ' సాంగ్ అయితే నేటికీ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతూ ఉంది. 40 సంవత్సరాల వయసున్న రేఖ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం, పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆమె మాట్లాడుతు సల్మాన్ ఖాన్ లాగా నేను కూడా సింగిల్ గా మిగిలిపోతానేమోననిపిస్తోంది. గతంలో నేను ఒకరిని బాగా ఇష్టపడ్డాను. కానీ ఈ విషయం అతనికి చెప్పలేదు. చెప్తే ఏమంటారో, వర్కౌట్ అవుతుందో లేదోనని భయపడ్డాను. ఆ తర్వాత నాకు మంచి అబ్బాయి ఎవరూ దొరకట్లేదు. నాకు ఎవరో ఉన్నారు అని నా గురించి తెగ ప్రమోట్ చేశారు. కానీ నేను ఇంకా సింగిల్ గానే ఉన్నాను. ఈ భూమి మీద పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఎవరూ ఉండరు. నేను కూడా పర్ఫెక్ట్ కాదు. కానీ నాకు ఓ మంచి అబ్బాయి కావాలి. నన్ను బాగా ప్రేమించాలి . నన్ను జెన్యూన్ గా ఇష్టపడే వాళ్లు ఎవరైనా ఉండి మంచి వాళ్లు అయితే నాకు ఇన్‌స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. నాకు నచ్చితే కచ్చితంగా రిప్లై ఇస్తాను. ప్రేమలో ఓపిక ఉండాలి. టీనేజ్ లవ్ వేరు. ఇప్పటి లవ్ వేరు. లవ్ లో ప్యూరిటీ ఉండాలి. నేను అదే కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
Also read: Jailer 2: జైలర్ 2 ఆ డేట్ కి ఎందుకు! రిలీజ్ చేస్తున్నారు!
2014 నుండి 2020 వరకు వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు దూరంగా ఉన్న రేఖ కోవిడ్‌కు ముందు టెలివిజన్ షోల ద్వారా రీఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నించింది. కానీ దురదృష్టవశాత్తూ ఆ సమయంలో వచ్చిన అనారోగ్య సమస్యల వల్ల ఆమె శరీరం పూర్తిగా సహకరించలేదు. ఆ సమస్యల నుండి పూర్తిగా కోలుకోవడానికే దాదాపు 3 సంవత్సరాల సమయం పట్టింది. ఇటీవల బుల్లితెరపై కనిపించిన ఆమె రూపాన్ని చూసి అభిమానులు సైతం షాక్‌కు గురయ్యారు. ఒకప్పుడు ఎంతో క్యూట్‌గా, బొద్దుగా ఉన్న రేఖ, అనారోగ్యం కారణంగా గుర్తుపట్టలేనంతగా బక్కచిక్కిపోయి కనిపించింది. 'ఆనందం' మూవీతో పాటు 'దొంగోడు', 'ఒకటో నెంబర్ కుర్రాడు', 'జానకి వెడ్స్ శ్రీరామ్' వంటి చిత్రాలతో పాటు తమిళం, కన్నడ భాషల్లో దాదాపు 30కి పైగా చిత్రాల్లో చేసింది. పూర్తి పేరు రేఖ వేద వ్యాస్.







